2026 Honda Elevate Facelift : SUV లవర్స్‌కు గుడ్ న్యూస్! అక్టోబర్‌లో రోడ్డెక్కనున్న కొత్త హోండా ఎలివేట్.. ఇవే టాప్ మార్పులు!
2026 Honda Elevate Facelift : కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెల అక్టోబర్‌లో లాంచ్ కానుంది. ఈ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లలో భారీగా మార్పులు చేయనుంది. కొత్త హోండా ఎలివేట్‌లో రాబోయే కొత్త మార్పులేంటి?
2026 Honda Elevate Facelift
- హోండా SUV కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్
- అక్టోబర్‌లో భారత మార్కెట్లో రాబోయే కారు ఇదే
- హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్లలో మార్పులు
2026 Honda Elevate Facelift : అసలే పండగ సీజన్.. కొత్త SUVని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొత్త ఫేస్‌లిఫ్ట్ హోండా ఎలివేట్ అతి త్వరలో రాబోతుంది. కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్‌లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ ఎస్యూవీ డిజైన్‌ను మార్చేందుకు బదులుగా కంపెనీ ఫీచర్లలో భారీగా మార్పులు చేయనుంది. కొత్త హోండా ఎలివేట్‌లో ఓసారి వివరంగా పరిశీలిద్దాం..
లుక్, డిజైన్ అదుర్స్ :
కొత్త హోండా ఎలివేట్ కొద్దిగా కొత్త ఎక్స్‌ట్రనల్ డిజైన్‌తో వస్తుందని అంచనా. ఇందులో కొత్త గ్రిల్, కొత్త 2D హోండా లోగో, అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయని అంచనా. కంపెనీ కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా యాడ్ చేయొచ్చు. ఎల్ఈడీ లైటింగ్‌లో కూడా చిన్న మార్పులు ఉంటాయని అంచనా. అయితే, ఈ ఎస్యూవీ బేస్ డిజైన్ ప్లాట్ఫామ్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవని అంచనా.
హోండా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో గతంలో మాదిరిగానే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందిస్తుందని అంచనా. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఉంటాయి. 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్లు, వైర్లెస్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also : POCO M8X 5G : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. భారీ బ్యాటరీతో పోకో 5G ఫోన్ మీ బడ్జెట్లోనే..!
ఈ సెగ్మెంట్లోని ఇతర ఎస్‌యూవీలలో బాగా పాపులర్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయని అంచనా. అంతేకాదు.. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండొచ్చు.
ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఆప్షన్ :
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజన్ మార్పులు ఉండొచ్చు. ఈ ఎస్‌యూవీలో ప్రస్తుత 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కొనసాగించనుంది. 6-స్పీడ్ మాన్యువల్ CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయని అంచనా. సిటీ e:HEV వంటి హైబ్రిడ్ సిస్టమ్‌ను ఈ కొత్త ఎస్‌యూవీలో అమర్చే ఛాన్స్ లేదు. ఈ అప్డేట్లో కంపెనీ ఇంజన్ కన్నా డిజైన్ ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చని సమాచారం.
