Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీకి శాశ్వత పరిష్కారం.. 6 కోచ్‌లతో కొత్త రైళ్లు
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
TG government set to procure 6-coach trains to reduce rash on hyderabad Metro.
- హైదరాబాద్ మెట్రోకు గుడ్ న్యూస్
- 60 కొత్త కోచ్‌ల కొనుగోలు
- 6 లక్షలకు ప్రయాణికుల సామర్థ్యం
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఐటీ కారిడార్ సహా నగరం వ్యాప్తంగా పీక్ అవర్స్‌లో మెట్రో రైళ్లలో నెలకొంటున్న విపరీతమైన రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం లేక ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త మెట్రో రైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Maredumilli Accedent: మారేడుమిల్లి వద్ద ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో.. యువకుడు మృతి
రూ. 600 కోట్లతో 60 కొత్త కోచ్‌లు:
రద్దీకి చెక్ పెట్టేందుకు తొలి దశలో రూ. 600 కోట్ల అంచనా వ్యయంతో 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనున్నారు. వీటి ద్వారా 6 కోచ్‌లతో కూడిన 10 కొత్త రైళ్ల(Hyderabad Metro)ను అందుబాటులోకి తేనున్నారు. ఒక్కో రైలు కొనుగోలుకు రూ. 60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, త్వరలోనే వీటి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించనుంది. ప్రస్తుతం మూడు కోచ్‌ల రైళ్లలో వెయ్యి మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉండగా, 6 కోచ్‌ల రైళ్లు రాకతో ఒక్కో సర్వీసులో 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు.
రోజుకు 6 లక్షల మందికి సౌకర్యం:
ప్రస్తుతం రోజువారీగా 4.5 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ముఖ్యంగా అమీర్‌పేట్ – రాయదుర్గం మార్గంలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఈ కొత్త 6 కోచ్‌ల రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సామర్థ్యం రోజుకు 6 లక్షలకు పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తర్వాతి రైలు కోసం ఎదురుచూసే అవసరం లేకుండా, రద్దీ నియంత్రణతో ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మారనుంది.
