Gold and silver prices
Gold and silver prices : క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read : Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.2,400 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 142 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,482 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తద్వారా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది. సోమవారం, మంగళవారాల్లో కలిపి కిలో వెండిపై రూ.8వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,27,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,38,550కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,150 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,38,700కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,27,000 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,38,500కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,23,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,34,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.