Gold And Silver Prices
Gold Rates Today : బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన వెండి ధర మళ్లీ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ.. కిలో వెండి రూ.2లక్షలు దాటేసింది..
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఏకంగా 18డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,206 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర రికార్డుల మోత మోగిస్తోంది. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.8వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలు దాటేసింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈనెల చివరి నాటికి వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,19,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,310కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,600 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,460కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,20,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,31,240కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.8వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,07,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,99,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,07,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read : Plane hits car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..