Plane hits car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..

Plane hits car : హైవేపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టిన ఘటన అమెరికాలోని ప్లోరిడాలో చోటు చేసుకుంది.

Plane hits car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్..

Plane hits car

Updated On : December 10, 2025 / 9:06 AM IST

Plane hits car : హైవేపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టిన ఘటన అమెరికాలోని ప్లోరిడాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది.. కారులో ఉన్న మహిళకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Telangana Vision document : తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. రాష్ట్రానికి 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం బీభత్సం సృష్టించింది. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి బ్రెవర్ట్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ -95 జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును విమానం ఢీకొట్టింది. కారు వేగంగా వెళ్తుండగా.. విమానం గాల్లో నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారంతా సేఫ్ గా బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానంలో నేరుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టిండి.. ఆ తరువాత కారు, విమానం పక్కకు దూసుకెళ్లాయి. కారు వెనుకాలే వస్తున్న ఓ కారుకు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.