Telangana Vision document : తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. రాష్ట్రానికి 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే..

Global Summit 2025 : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు.

Telangana Vision document : తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. రాష్ట్రానికి 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే..

Telangana Rising 2047 Vision document

Updated On : December 10, 2025 / 8:20 AM IST

Telangana Rising 2047 Vision document : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు. సమ్మిళత, సుస్థిర అభివృద్ధితో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 10 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చారు.

Also Read: Vision Document: 4 లక్షల మంది సూచనలు ఇచ్చారు.. విజన్ డాక్యుమెంట్‌ లక్ష్యం ఇదే: రేవంత్ రెడ్డి

మూడు మూల స్తంభాలైన ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి సాయంతో తెలంగాణలో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులను తీర్చిదిద్దడం ద్వారా 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రంను తీర్చిదిద్దేందుకు గేమ్ చేంజర్ ప్రాజెక్టులను ఎంచుకున్నామని చెప్పారు.

మూడు మూలస్తంభాలివే..
♦ ఆర్థిక వృద్ధి : ఆవిష్కరణలు, ఉత్పాదకతల పునాదులపై జరిగే అభివృద్ధి ఆధారంగా క్యూర్-ప్యూర్-రేర్ విధానంతో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన.
♦ సమ్మిళిత అభివృద్ధి : ఈ వృద్ధి ఫలాలను యువత, మహిళలు, రైతులు, అట్టడుగున ఉన్న వర్గాలు, సమాజంలో అన్ని వర్గాలకు అందించడం.
♦ సుస్థిర అభివృద్ధి : హరిత మార్గంలో 2047 నాటికి అన్ని రంగాల్లో సుస్థిరత.

13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే..
♦ భారత్ ఫ్యూచర్ సిటీ
♦ మూసీ పునరుజ్జీవనం
♦ డ్రైపోర్టు
♦ డ్రైపోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే
♦ బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నైకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
♦ ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో తయారీ రంగం అభివృద్ధి
♦ రీజనల్ రింగు రోడ్డు
♦ ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్లు
♦ రీజనల్ రింగ్ రైల్వే
♦ వ్యవసాయ భూములకు గ్రీన్ ఎనర్జీ
♦ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్
♦ గ్రీన్ ఎనర్జీ హబ్స్
♦ ఎలక్ట్రానిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడం

వీడియో వైరల్ ..