Gold
Gold and Silver Rate Today 8th October 2023: మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, ఆలస్యం చేయకండి.. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని పలువురు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణంకూడా ఉంది. గత పదిహేను రోజులకుపైగా బంగారం ధరలు తగ్గుకుంటూ వచ్చాయి. అయితే, రెండు రోజులుగా వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరుగుదల చోటు చేసుకుంది. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా ఆదివారం బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250, అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 310 పెరుగుదల చోటు చేసుకుంది. వెండి ధరలుసైతం పెరిగాయి. కిలో వెండిపై రూ. 2వేల పెరుగుదల చోటు చేసుకుంది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. ఆదివారం ఉదయం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 52,750కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,540 వద్ద కొనసాగుతుంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 57,690 వద్దకు చేరింది.
– చెన్నైలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 850 పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 930 పెరిగింది. దీంతో చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 53,700కు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,580 వద్ద కొనసాగుతుంది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 52,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,540 వద్ద కొనసాగుతుంది.
Gold
భారీగా పెరిగిన వెండి ధర..
దేశ వ్యాప్తంగా వెండి ధర మళ్లీ పెరిగింది. శనివారం కిలో వెండిపై రూ. 500 తగ్గగా, ఆదివారం రూ.2వేలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో కిలో వెండిపై రూ. 1500 పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో ఆదివారం అక్కడ కిలో వెండి రూ.72,100 వద్దకు చేరింది. బెంగళూరులో మాత్రం కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 68,800 వద్ద కొనసాగుతోంది.