Gold Guide : ఇంట్లో బంగారం ఎంత ఉండొచ్చు? ఇన్‌కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టాలా? పెళ్లి అయ్యాక మహిళల దగ్గర ఎంత ఉండాలి?

Gold Guide : మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది? ఎంతైనా బంగారం దాచుకోవచ్చులే అంటే కుదరదు.. ప్రతిదానికి ఒక లిమిట్ ఉన్నట్టే బంగారానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇంట్లో బంగారాన్ని ఎంత ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Guide

Gold Guide : బంగారం అనగానే మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం తగ్గింది అని తెలిస్తే వెంటనే ఇంటికి కొని తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. బంగారంపై మహిళలకు అంతగా మక్కువ ఉంటుందని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎప్పటినుంచో ప్రాముఖ్యత ఉంది.

ఎవరి ఇంట్లో శుభాకార్యాలు జరిగినా పండగులు లేదా పెళ్లిళ్ల సమయంలో తప్పనిసరిగా బంగారం టాపిక్ వస్తూనే ఉంటుంది. మహిళలు ఎక్కడ ఉన్నా వారి మొదటి టాపిక్ కూడా ఈ బంగారం గురించే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినా బంగారు ఆభరణాలతోనే కనిపిస్తుంటారు. అలాంటి బంగారం ఒక గ్రాము తగ్గినా వెంటనే కొనేస్తుంటారు. మరికొంత మంది అయితే బంగారం కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టే వాళ్లు లేకపోలేదు.

Read Also : 8th Pay Commission : ఉద్యోగుల కనీస వేతనం రూ. 51,480కి పెరగనుందా? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? గత కమిషన్లలో ఎంత పెరిగిందంటే?

బంగారంపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంటుందా? :
ఇంతవరకు బాగానే ఉంది.. మరి.. ఈ బంగారాన్ని ఎంతపడితే అంత కొనేసుకోవచ్చా? సంపాదించిన డబ్బుపై ట్యాక్స్ ఉన్నట్టే ఇంట్లో కూడబెట్టిన బంగారానికి కూడా ఏమైనా ట్యాక్స్ ఉంటుందా? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవును.. బంగారానికి కూడా పరిమితులు ఉన్నాయి.

ప్రతిఒక్కరి ఇంట్లో బంగారం ఎంత మొత్తంలో బంగారం ఉండాలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. దీని ప్రకారం.. పెళ్లి అయిన మహిళ తన ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని పెట్టుకోవచ్చు. ఎంత బంగారం ఇంట్లో ఉంచుకోవచ్చంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( CBDT ) నిబంధనల ప్రకారం.. బంగారాన్ని నిర్దేశించిన మొత్తంలోనే బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే.. మీకు అంత బంగారం ఎలా వచ్చిందో మీరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. డబ్బులకు లెక్క చెప్పినట్టుగానే బంగారానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ చూపించాలి.

ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చుంటే? :
సాధారణంగా పెళ్లి అయిన మహిళలు ఎక్కువగా బంగారం కొంటుంటారు. అందుకే వివాహితలు తమ ఇంట్లో 500 గ్రామలు బంగారాన్ని పెట్టుకోవచ్చునని ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం చెబుతోంది. అదే పెళ్లి కాని మహిళలు అయితే తమ ఇంట్లో 250 గ్రాముల గోల్డ్ ఉంచుకోవచ్చు.

అదేవిధంగా, ఒక ఫ్యామిలీలోని ఎవరైనా పురుషులు తమ దగ్గర 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవాలి. ఒకవేళ మీకు వారసత్వంగా బంగారం పొందితే పన్ను ఉంటుందా? అంటే.. మీకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, చట్టబద్ధమైన వారసత్వం ద్వారా బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి పన్ను ఉండదు.

Read Also : SBI vs BoB vs PNB : మీరు లక్షో, 2 లక్షలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లలో ఏ బ్యాంక్‌లో ఎక్కువ డబ్బులొస్తాయి?

బంగారంపై పన్ను ఎప్పుడు ఉంటుందంటే? :
బంగారంపై పన్ను ఉండదు. కానీ, ఆ బంగారాన్ని అమ్మేవారు మాత్రం తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు బంగారం కోనుగోలు చేసిన 3 ఏళ్ల తర్వాత విక్రయిస్తే.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (LTCG) విధిస్తారు. దానిపై వచ్చే లాభంపై 20శాతం ట్యాక్స్ చెల్లించాలి.

మీరు ఒకవేళ ఏదైనా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన 3 ఏళ్లలోపు విక్రయిస్తే విక్రేత ఆదాయంలోకి వస్తుంది. పన్ను నిబంధనలను బట్టి దీనిపై పన్ను కట్టాల్సిందే. మెచ్యూరిటీ కోసం గోల్డ్ బాండ్ పెట్టి విక్రయిస్తే మాత్రం ఎలాంటి పన్ను ఉండదు.