Gold Rates Today : సామాన్యులు కొనేదెట్టా.. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి రెక్కలు.. మళ్లీ రికార్డు స్థాయిలో గరిష్టానికి.. భారత్‌‌లో ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

Gold Rate Today India : బంగారం ధర మళ్లీ కొత్త రికార్డును తాకింది. బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ట్రంప్ టారిఫ్ ప్రతిపాదనలతో ఆర్థిక నష్టాల గురించి పెరుగుతున్న ఆందోళనలతో బంగారం ధరలు పెరిగాయి.

Gold Hits Record High Globally

Gold Rate Today In India : బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రానురాను సామాన్య ప్రజలు బంగారాన్ని కొనే పరిస్తితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఇటీవల బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ కారణంగా భారత్‌లో బంగారం ధరలు జనవరి 31, 2025 (శుక్రవారం) పెరిగాయి.

దేశీయ ఫ్యూచర్స్, బులియన్ మార్కెట్లలో బంగారం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 70 డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 2850 డాలర్లకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధర రూ. 1,200 ఎగబాకి రూ. 82,100తో జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బంగారం ధర 147 రూపాయల పెరుగుదలతో దాదాపు రూ.81,870 వద్ద ట్రేడవుతోంది.

ఇంతకు ముందు ఇది రూ.82,200 పైనే చేరింది. నిన్న రూ.81,723 వద్ద ముగిసింది. ఈ సమయంలో, ఎంసీఎక్స్ (MCX) వెండి కిలో ధర రూ. 93,740 వద్ద నుంచి 93,446 వద్ద ముగిసింది.

Read Also : Budget 2025 : పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో ఈ 5 ముఖ్యమైన మినహాయింపులు ఉండవు.. తప్పక తెలుసుకోండి!

దేశ రాజధాని న్యూఢిల్లీలో 24కే బంగారం ధర 10 గ్రాములకు రూ.84,480గా ఉండగా, 22కే బంగారం 10గ్రాములకు రూ.77,450గా గత బుధవారం నమోదైంది. “బంగారం వెండి ధరలు బాగా పెరిగాయి. బంగారం ప్రపంచవ్యాప్తంగా స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో కొత్త రికార్డులను తాకింది.

6 వారాల గరిష్ట స్థాయికి వెండి ధరలు :
యూఎస్ పెండింగ్‌లో ఉన్న గృహ విక్రయాలు, ముందస్తు జీడీపీ డేటా కారణంగా వెండి ధరలు 6 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి” అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలంత్రి వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2,799.2 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, న్యూయార్క్‌లో ఔన్స్ వెండి 31.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చార్ట్-ఆధారిత కొనుగోలు, విలువైన లోహాలు రెండింటికి మద్దతు ఇస్తాయని కలంత్రి చెప్పారు.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఐదవ వరుస సమావేశానికి 0.25 శాతం తగ్గించి అమెరికా డాలర్ ఇండెక్స్‌పై ఒత్తిడి తెచ్చింది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లలో తాజా తగ్గుదల, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రతిపాదనలతో ఆర్థిక నష్టాలపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

భారత్‌లో వెండి ధర ఎంతంటే? :
దేశీయ డిమాండ్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ప్రధాన భారతీయ నగరాల్లో వెండి ధర కూడా కిలోకు రూ.1,000 పెరిగి రూ.99,500కి చేరుకుంది.

దేశీయ ప్రధాన  నగరాల్లో బంగారం ధరలివే :
ఢిల్లీలో 22K బంగారం (10 గ్రాములకు) బంగారం ధర రూ.77,450 ఉండగా, 24K బంగారం (10 గ్రాములకు) రూ. 84,480కు పెరిగింది. ముంబై నగరంలో అదే 10 గ్రాముల 22కె బంగారం ధర రూ.రూ.77,300 ఉండగా, 24K బంగారం ధర రూ. రూ.84,330కు పెరిగింది. చెన్నైలో రూ. 77,300, రూ. 84,300 పెరిగితే, కోల్‌కత్తాలో 22కె, 24కె బంగారం ధరలు వరుసగా రూ. 77,300, రూ.84,330కి పెరిగాయి.

ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు :
భారత ఫ్యూచర్స్ మార్కెట్‌లో, ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లో బంగారం 0.25 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 82,250 వద్ద, వెండి 0.20 శాతం పెరిగి కిలోకు రూ. 93,635 వద్ద ట్రేడవుతోంది. “మెక్సికో, కెనడా నుంచి ఎగుమతులపై యునైటెడ్ స్టేట్స్ 25 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ ప్రకటించడంతో ఎంసీఎక్స్ బంగారం రికార్డు స్థాయిలో రూ. 82,100కి చేరుకుంది.

అధ్యక్షుడి ప్రణాళిక వాణిజ్య యుద్ధాల భయాలను రేకెత్తించడంతో మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. ఆర్థిక మందగమనానికి అవకాశాలు ఉన్నాయి” అని యాక్సిస్ సెక్యూరిటీస్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీస్) దేవేయా గగ్లానీ అన్నారు.

రిటైల్ బంగారం గరిష్టంగా రూ.83,800 :
బలమైన గ్లోబల్ ట్రెండ్ మధ్య, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు వరుసగా రెండవ సెషన్‌కు పెరిగాయి. 10 గ్రాములకు రూ. 83,800 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.83,800కి చేరుకుంది.

Read Also : Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్.. అప్పటిలా షేర్ మార్కెట్‌పై అదే అనవాయితీ.. వారాంతంలో ట్రేడింగ్..!

గత బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.83,750 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.50 పెరిగి 10 గ్రాములకు రూ.83,400 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.83,350 వద్ద ముగిసింది.

భారత్‌లో బంగారం ధరలపై ప్రభావితమయ్యే అంశాలివే :
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా దేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలు దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి.