Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్.. అప్పటిలా షేర్ మార్కెట్‌పై అదే అనవాయితీ.. వారాంతంలో ట్రేడింగ్..!

Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సందర్భంగా శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవు లేదు. మార్కెట్ ఎప్పటిలానే తెరిచే ఉంటుంది.. ఎందుకంటే?

Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్.. అప్పటిలా షేర్ మార్కెట్‌పై అదే అనవాయితీ.. వారాంతంలో ట్రేడింగ్..!

Union Budget 2025

Updated On : January 31, 2025 / 11:02 AM IST

Union Budget 2025 : అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2025‌కు ఇంకా ఒక రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అయితే, బడ్జెట్ రోజున శనివారం కావడంతో స్టాక్ మార్కెట్‌ ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, బడ్జెట్ కారణంగా ఆరోజున స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసే ఉంటుందని ఎంసీఎక్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Budget 2025 : గృహరుణాలు తీసుకునేవారికి శుభవార్త.. రూ. 2.67 లక్షల క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ..? వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్!

గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా వారాంతం కావడంతో ఆరోజు షేర్ మార్కెట్ పనిచేసింది. ఇప్పుడు మళ్లీ అదే అనవాయితీని కొనసాగించనున్నారు. దేశీయ ఎక్స్ఛేంజీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX)లో శనివారం ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే, బడ్జెట్ సందర్భంగా స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్టు ఎంసీఎక్స్ వెల్లడించింది.

మార్కెట్ టైమింగ్స్ ఏంటి? :
2025 ఫిబ్రవరి ఒకటో తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ కొనసాగుతుంది.
ఎంసీఎక్స్ ప్రకటన ప్రకారం. భారత ఎక్స్ఛేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఫిబ్రవరి 1న శనివారం స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్‌ నిర్వహించనుంది.

స్టాక్ మార్కెట్లకు నో హాలిడే.. : 
బడ్జెట్ సందర్భంగా ఎంసీఎక్స్ సహా స్టాక్ మార్కెట్ తెరిచే ఉండనుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కూడా వేర్వేరుగా సర్క్యులర్‌లను జారీ చేశాయి. ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటల మొదలై ఆరోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగించనున్నాయి. బడ్జెట్ రోజున శనివారం స్టాక్ మార్కెట్ హాఫ్ డే ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఫుల్ కొనసాగించనున్నట్టు నిర్ణయించాయి.

వారాంతాల్లో స్టాక్ మార్కెట్ బంద్ ఉంటుందని అందరికి తెలిసిందే. బడ్జెట్ ఉండటంతో ఈసారి స్టాక్ మార్కెట్‌ను యథాతథంగా కొనసాగించనున్నారు. గతంలో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2020, ఫిబ్రవరి 28, 2015 సంవత్సరాల్లో కూడా వారాంతాల్లోనే సమర్పించారు. బడ్జెట్ రోజున ఆరోజు శనివారమైన స్టాక్ మార్కెట్ ఓపెన్ అయింది.

శనివారమే కేంద్ర బడ్జెట్‌ :
సాధారణంగా శనివారం, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లు ఉండవు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న (శనివారం) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌ను తెరిచే ఉంచనున్నట్టు ఎంసీఎక్స్ ప్రకటించింది.

ఎప్పటిలానే నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎవరికి ఊరటనిస్తుంది? ఎవరికి అసంతృప్తిని మిగుల్చుతుంది అనేది ఉత్కంఠంగా మారింది. చివరిగా ఎవరెవరికి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలు ఉంటాయో వేచి చూడాల్సిందే.

Read Also : Budget 2025 : పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో ఈ 5 ముఖ్యమైన మినహాయింపులు ఉండవు.. తప్పక తెలుసుకోండి!