Budget 2025 : గృహరుణాలు తీసుకునేవారికి శుభవార్త.. రూ. 2.67 లక్షల క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ..? వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్!

Budget 2025 : ఇంటి కొనుగోలుదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ తిరిగి ప్రవేశపెడతారనే ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ స్కీమ్ తీసుకువస్తారని భావిస్తున్నారు.

Budget 2025 : గృహరుణాలు తీసుకునేవారికి శుభవార్త.. రూ. 2.67 లక్షల క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ..? వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్!

Budget 2025

Updated On : January 30, 2025 / 8:13 PM IST

Budget 2025 : వచ్చే బడ్జెట్ 2025లో మధ్యతరగతివారికి కేంద్రం శుభవార్త చెప్పబోతుందా? ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని మళ్లీ అందించనున్నారా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.

అదేగానీ నిజమైతే హోంలోన్ తీసుకునేవారికి రూ. 2.67లక్షల సబ్సిడీ అందే అవకాశం కనిపిస్తోంది. గృహ రుణ గ్రహీతలు, పన్ను మినహాయింపులు, జీఎస్టీ తగ్గింపులు, సరసమైన గృహ పథకాలపై అంచనాలతో ఆర్థిక భారాలను తగ్గించుకునేందుకు బడ్జెట్ 2025లో గణనీయమైన విధాన మార్పులను ఆశిస్తున్నారు.

Read Also : India AI model : డీప్‌సీక్, చాట్‌జీపీటీకి పోటీగా ఏఐ రేసులో భారత్.. ఎప్పుడు? ఎలా? ఫుల్ డిటెయిల్స్..

వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ పద్దులను సిద్ధం చేసే పనిలో పడింది ఆర్థిక శాఖ. బడ్జెట్ సమయం దగ్గరపడుతున్న తరుణంలో అనేక మందిలో కొత్త ఆశలను రేకిత్తిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా గృహరుణాలను తీసుకున్నవారంతా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. హోం లోన్ ద్వారా ఇంటిని కొనుగోలు చేసి ఆర్థిక భారం తగ్గేలా ఏమైనా కొత్త పాలసీలను తీసుకువస్తారని భావిస్తున్నారు.

పీఎంఏవై క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ప్రయోజనాలేంటి? :
గృహ కొనుగోలుదారులకు ఒక్కో ఇంటికి 2.67 లక్షల వరకు వడ్డీ రాయితీని అందించారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర వాటి నుంచి హౌసింగ్ లోన్‌లు కోరుతున్న ఆర్థికంగా బలహీనమైన విభాగంలో (EWS)/లేదా లో ఇన్‌కమ్ గ్రూపు (LIG), మిడిల్ ఇన్‌కమ్ గ్రూపు (MIG)-I, మిడిల్ ఇన్‌కమ్ గ్రూపు (MIG)-II లబ్దిదారులకు ఈ మొత్తం అనుమతిస్తారు.

ఇందులో గృహాలను కొనుగోలు చేయడం/నిర్మించడం వంటివి ఉంటాయి. గృహ కొనుగోలుదారులకు 60,160, 200 వరకు స్క్వేర్ మీటర్ల కార్పెట్ ఏరియా ఉన్న ఇంటికి అనుమతించే రూ. 6 లక్షల, రూ. 9 లక్షలు, రూ. 12 లక్షల వరకు రుణ మొత్తాలపై 6.5శాతం, 4శాతం, 3శాతం వడ్డీ రాయితీలను అందిస్తారు. హౌసింగ్ ఫైనాన్స్, బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకున్న సమయంలో ఇది వర్తిస్తుంది.

Read Also : iPhone 15 Pro Price : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఐఫోన్ 16ప్రో కన్నా బెటర్ డీల్.. ఇప్పుడే కొనేసుకోండి!

క్లాస్ (CLSS) స్కీమ్ ఎప్పుడు తొలగించారు? :
EWS/LIG గ్రూపులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ స్కీమ్ మార్చి 31, 2022న తొలగించారు. కానీ, తర్వాత మళ్లీ ఇదే స్కీమ్ ప్రవేశపెట్టారు. ఎంఐజీ విభాగాల్లో ఈ స్కీమ్ మార్చి 31, 2021న తొలగించారు. అయితే, మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ (MIG) వారికి మాత్రం తొలగించిన సబ్సిడీని మళ్లీ తీసుకురాలేదు.

ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి వారు ఈ వడ్డీ సబ్సిడీని మళ్లీ తీసుకురావాలని కోరుతున్నారు. మరోవైపు.. రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. వడ్డీ సబ్సిడీ పునరుద్ధరించడం వల్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చేయబోయే ప్రకటనపైనే అందరి దృష్టి నెలకొంది.