India AI model : డీప్‌సీక్, చాట్‌జీపీటీకి పోటీగా ఏఐ రేసులో భారత్.. ఎప్పుడు? ఎలా? ఫుల్ డిటెయిల్స్..
India AI model : అమెరికా, చైనా ఏఐ టెక్ దిగ్గజాలకు పోటీగా ఇండియా ఏఐ రేసులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాబోయే 8-10 నెలల్లో భారత్ సొంత ఏఐ మోడల్ విడుదల చేయనుంది.

India to develop its own generative AI model
India AI model : ఏఐ రంగంలో ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటు డ్రాగన్ చైనా, అటు అమెరికా ఏఐ రేసులో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి.
ఇప్పటికే చైనా చాట్‌జీపీటీ, డీప్‌సీక్, అలీబాబా ఏఐ మోడల్ రేసులోకి ఎంట్రీ ఇవ్వగా.. త్వరలో భారత్ కూడా ఏఐ రేసులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ (ChatGPT), చైనా డీప్‌సీక్ (DeepSeek) తరహాలో భారత్ కూడా తన సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఒడిశాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. 2025 ఏడాదిలోనే ఈ ఏఐ మోడల్‌ను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాబోయే 8-10 నెలల్లో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయనుందని ఆయన వెల్లడించారు.
దేశం అవసరాలకు అనుగుణంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అభివృద్ధి చేసేందుకు 18,000GPUలను పొందిన ఇండియా ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ ద్వారా రూపొందించనున్నట్టు తెలిపారు.
రాబోయే 10 నెలల్లో ఏఐ మోడల్ విడుదల : వైష్ణవ్
ఈ ఏఐ మోడల్ పూర్తిగా భారతీయ ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో పాటు అతితక్కువ ఖర్చుతో రూపొందించనున్నట్టు వైష్ణమ్ చెప్పారు. ఒడిషాలో ఏఐ డేటా సెంటర్లను స్థాపించే ప్రణాళికలను కూడా వెల్లడించారు. భారత్ ఏఐ ఎకోసిస్టమ్, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో కనీసం 6 పెద్ద డెవలపర్లు ఉన్నారని, గరిష్టంగా 8-10 నెలల్లో ఏఐ మోడల్‌లను రూపొందించగలరని కేంద్ర మంత్రి చెప్పారు. బలమైన ఏఐ ఎకోసిస్టమ్ రూపొందించేందుకు కచ్చితమైన అంచనా చాలా ముఖ్యమని అన్నారు.
భారత్ ఏఐ మిషన్‌ను దృష్టిలో ఉంచుకుని భాగస్వామ్య కంప్యూటింగ్ వనరులను ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. భారత్ ఏఐ కంప్యూట్ ఫెసిలిటీ అంచనాలను మించిపోయిందని, దాదాపు 19వేల జీపీయూలను కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు.
Read Also : Deepseek AI: ఒక్క రోజే అమెరికన్ కంపెనీల రూ.8,65,20,50,00,00,000 డబ్బులు ఫసక్.. ఏంటీ చైనా డీప్ సీక్ ఏఐ
ఇందులో 12,896 (Nvidia) H100 జీపీయూ, 1,480 Nvidia H200 జీపీయూలు ఉండగా, వాటిలో 10వేల జీపీయూలు ఇప్పుడు ఉపయోగానికి రెడీగా ఉన్నాయి. ఈ సదుపాయం అందరికీ అందుబాటులో ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఏఐ కొత్త మోడల్ ప్రారంభం కానుంది.
ఏఐ మోడల్స్ రేసు తీవ్రతరం :
ఓపెన్ఏఐ 2023 చివరిలో చాట్‌జీపీటీ ప్రవేశపెట్టడం ద్వారా ఏఐ మోడల్స్ రేసును ప్రారంభించింది. ఆ తర్వాత చాలా కంపెనీలు ఈ ఏఐ రేసులో చేరాయి. ఇటీవలి కాలంలో, చైనీస్ స్టార్టప్‌ల ఏఐ మోడల్స్ మొత్తం చిత్రాన్ని మార్చాయి.
అమెరికన్ కంపెనీల కన్నా చైనా చాలా తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్‌లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు భారత్ కూడా ఏఐ కొత్త మోడల్ రూపొందించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఏఐ రంగంలో అమెరికా, చైనాల సరసన భారత్ కూడా నిలిచే అవకాశం ఉంటుంది.