×
Ad

Gold Price decreased : భారీగా పడిపోతున్న బంగారం ధర.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 115 డాలర్లు డౌన్.. భారత్‌లో అయితే..

Gold Price decreased : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గుతోంది.

Gold Price decreased

Gold Price decreased : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. గతంలో ఎప్పుడూలేని స్థాయిలో గోల్డ్ రేటు పెరగడంతో.. బంగారం అంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేటు దిగొస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం సాయంత్రం బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అమెరికన్ డాలర్ బలపడడం, యూఎస్ – చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సంకేతాలు బంగారంపై తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. సోమవారం అంతర్జాతీయంగా ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 115 డాలర్లకుపైగా తగ్గి, 3,994 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, దేశీయంగా డాలర్ విలువ 36 పైసలు పెరగడంతో, ఆ స్థాయిలో దేశీయంగా పసిడి ధర తగ్గలేదు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ విఫణిలో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.1,24,400 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.1,48,200 వద్ద ట్రేడవుతోంది.

Also Read: Silver Price : వెండి రేటు ఢమాల్.. వారం రోజుల్లో 18శాతం తగ్గింది.. మళ్లీ లక్ష దిగువకు చేరుతుందా..? నిపుణులు ఏం చెప్పారంటే?

భారతదేశంలోనూ బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పది రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై సుమారు రూ.9వేలు తగ్గింది. ఇన్నాళ్లు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. వెండి ధర సైతం తగ్గుతోంది. గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై రూ.30వేలకుపైగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1.50లక్షలకు దిగువకు వచ్చేసింది.

ధరల పతనానికి దారితీసిన కీలక అంశాలను పరిశీలిస్తే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆయిల్ కంపెనీలు లూకోయిల్, రోస్‌నెఫ్ట్‌లపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం.
అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవబోతున్నారన్న వార్త మార్కెట్‌ను ప్రభావితం చేసింది.
అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) నివేదిక: పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం ఈ నివేదికపైనే కేంద్రీకృతమై ఉంది. సెప్టెంబర్‌ కోర్ ఇన్‌ఫ్లేషన్ 3.1శాతం వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు: అమెరికాలో తాత్కాలిక షట్‌డౌన్ కారణంగా రేటు కోతల ప్రకటనలు ఆలస్యమైనా, వచ్చే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల రేటు కోత ఉంటుందని పెట్టుబడిదారులు ముందుగానే అంచనా వేస్తున్నారు.