Gold Price
Gold Price Forecast: బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,833 దాటింది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత వారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక వారం రోజుల్లో రూ.3,920 పెరిగింది. ఇళ్లలో పెళ్లిళ్లు ఉన్నవారికి ఇది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే పెళ్లి సీజన్‌లో బంగారం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
సాధారణంగా పండుగ సీజన్‌లో బంగారం, వెండి డిమాండ్ పెరుగుతుంది. శుభకార్యాల కోసం ప్రజలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే ఈసారి బంగారం ధరలు అంత అధికంగా ఉండటంతో ప్రజలు ఆభరణాల దుకాణాలకు వెళ్లడానికి సంకోచిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఇప్పుడు బంగారం ఆభరణాలు తయారు చేయించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. (Gold Price Forecast)
Also Read: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? Vivo V50e 5Gపై అద్భుతమైన ఆఫర్.. కొంతకాలం మాత్రమే..
మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గే అవకాశం లేదు. ఈ ధనత్రయోదశి-దీపావళికి దేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,22,000 దాకా చేరవచ్చు, వెండి ధరలు కిలోకు రూ.1,50,000 దాటవచ్చు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం వంటివి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.