Site icon 10TV Telugu

Gold Price : వామ్మో.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని భారీ మార్పు.. ట్రంప్ దెబ్బకు చరిత్రలో తొలిసారి..

Gold Price

Gold Price

Gold Price : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు (Gold Price) భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల మోతతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాత్రి రాత్రికి రాత్రే గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,640 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 33డాలర్లు పెరిగింది.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 3,447 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 1100 పెరిగింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచడంతో ఆ ప్రభావం రూపాయిపై పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలను తాకింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ.88.16వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.96,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,04,950 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,05,100 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.96,200 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,04,950కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,21,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,31,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: డేంజర్ లో ట్రంప్ హెల్త్?.. చేతిపై మచ్చ, కాళ్ల వాపు.. అవసరమైతే అధ్యక్ష పగ్గాలు చేపడతానంటున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఏం జరుగుతోంది?

Exit mobile version