Gold Price : అమ్మో బంగారం.. ఆల్‌టైమ్‌ గరిష్టానికి పసిడి ధర, 2రోజుల్లోనే ఎంత పెరిగిందంటే..

ఇటీవల కొద్దిగా జోరు తగ్గినట్లు అనిపించినప్పటికీ రెండు రోజులుగా గోల్డ్ రేటు పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.

Gold Prices All Time High

Gold Price : బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పుత్తడి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. గత రెండు రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడం, గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ అనూహ్యంగా పెరగడం దేశీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు రెక్కలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 10గ్రాముల బంగారం ధర రూ.64వేల మార్క్ ను(రూ.64,140) క్రాస్ చేసింది. గతేడాది డిసెంబర్ 4న గోల్డ్ రేట్ 64వేల మార్క్ ను అధిగమించగా.. తాజాగా ఆ రికార్డ్ ను తిరగరాసి ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది.

ఇటీవల కొద్దిగా జోరు తగ్గినట్లు అనిపించినప్పటికీ రెండు రోజులుగా గోల్డ్ రేటు పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ప్యూర్ గోల్డ్ ఢిల్లీ మార్కెట్ లో 64వేల రూపాయలను అధిగమించింది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 59వేలకు దగ్గరలో ఉంది. ఇక సిల్వర్ రేటు కూడా గోల్డ్ తో పోటీలు పడుతూ పరుగులు తీస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ఢిల్లీ మార్కెట్ లో 76వేలను క్రాస్ చేసింది.

గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ కు అనూహ్యంగా డిమాండ్ ఏర్పడింది. రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో రెండేళ్ల నుంచి పుత్తడి ధరల పైపైకి చూస్తున్నాయి. మధ్యలో కొత్త డీలా పడినప్పటికీ ఎప్పటికప్పుడు గోల్డ్ ధరలు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. డాలర్ మారకం విలువతో పాటు బ్యాండ్ ఈల్స్ విలువ తగ్గడం గోల్డ్ కు డిమాండ్ పెంచుతోంది.

* పసిడి పరుగులు
* ఆల్ టైమ్ గరిష్టానిక గోల్డ్ ధర
* గత 2 రోజుల్లో దాదాపు వెయ్యి రూపాయలు పెరిగిన బంగారం ధర
* హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10గ్రాముల ధర రూ.64,140
* గతేడాది డిసెంబర్ 4న రూ.64వేలు క్రాస్ చేసిన పుత్తడి ధర

Also Read : మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రూ.5.49 కోట్ల జరిమానా..!

 

ట్రెండింగ్ వార్తలు