Gold Price In India
Gold Price In India : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో మార్పులతో భారతదేశంలోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి.
పొరుగుదేశం చైనాలో ఇప్పుడు బంగారం డిస్కౌంట్లు భారీగా పెరిగాయి. అంటే, డీలర్లు గ్లోబల్ మార్కెట్ ధరతో పోల్చితే ఒక్క ఔన్సు బంగారానికి 17డాలర్ల నుంచి 24 డాలర్ల వరకు తక్కువ ధరను ప్రకటిస్తున్నారు. ఇది గతంలో గడిచిన నెలల కంటే అత్యధిక డిస్కౌట్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో అక్కడ బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్‌లో ప్రస్తుతం భౌతిక బంగారం నిల్వలు పెరిగి 50 మెట్రిక్ టన్నులకి చేరాయి.
భారతదేశంలో సోమవారం (సెప్టెంబర్ 15) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 110 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై మూడు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,645 డాలర్ల వద్ద కొనసాగుతుంది. వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,01,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,11,060కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,11,210కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,01,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,11,060కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,43,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,33,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,43,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read: Gold Prices : బంగారం లాంటి వార్త.. డబ్బులు రెడీ చేసుకోండి.. గోల్డ్ రేట్లు తగ్గబోతున్నాయ్..!