Gold Rate: అమెరికా వాణిజ్య సుంకాలు, ఆర్థికాభివృద్ధి మందగమనంపై ఆందోళనల కారణంగా బంగారం మార్కెట్ కాస్త క్షీణించింది. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం గురించి అమెరికా – ఐక్యరాజ్య సమితి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామం బంగారంపై పెట్టుబడిదారుల డిమాండ్ ను పెంచింది. అయితే, వచ్చే ఏడు రోజుల వ్యవధిలో బంగారం, వెండిధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం యూఎస్ డాలర్లలో వరక్తం చేయబడుతుంది. యూఎస్ డాలర్ భారత రూపాయితో పోలిస్తే బలపడితే భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్దంగా.. బలహీన పడితే బంగారం ధరలను తగ్గించడానికి దారితీస్తుంది.
ప్రపంచ బంగారం ధరలలో ఏదైనా హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. దీంతో భారతదేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి.
గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ వల్ల ఢిల్లీలో గురువారం పది గ్రాముల బంగారం రూ. 1,150 తగ్గింది. దీంతో 24క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ. 88,200కు పడిపోయింది. 22 క్యారట్ల బంగారం ధర రూ. 87,500 వద్దకు పడిపోయిందని ఆలిండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. మరోవైపు కిలో వెండి ధర రూ. వెయ్యి తగ్గింది. దీంతో కిలో వెండి రేటు రూ. 98,500 వద్ద కొనసాగుతుంది.