Gold Rate Today
Gold Price Today : కొద్దిరోజులుగా ప్రతీరోజూ వేలల్లో పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు (Gold Price Today) కాస్త శాంతించాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 540 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 40డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,188 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.9వేలు పెరగ్గా.. ఇవాళ (బుధవారం) కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ ఉధ్రిక్తతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ – చైనా వాణిజ్య ఉధ్రిక్తతతో పాటు.. అమెరికా షట్‌డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి వంటి పరిణామాలతో బంగారంపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూప్తున్నారని, ఈ క్రమంలో గోల్డ్ ఈటీఎఫ్‌లకు గిరాకీ విపరీతంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ధనత్రయోదశితో పాటు రాబోయే పెళ్ళిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరుకొనే అవకాశాలు కూడా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,18,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,28,890కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,29,040కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,18,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,28,890కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,07,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,90,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,07,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.