Gold Price Today : గోల్డ్ ప్రియుల కొంపముంచిన ట్రంప్.. ఇవాళ్టి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలు ఇవే.. ఇంకెన్నాళ్లు..?
Gold Price Today : బంగారం ప్రియులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. మళ్లీ బంగారం ధరకు రెక్కలొచ్చాయి.

Gold Price Today
Gold Price Today : బంగారం ప్రియులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. నిన్న (శుక్రవారం) బంగారం ధర భారీగా తగ్గింది.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గబోతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ బంగారం ధరకు రెక్కలొచ్చాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 57డాలర్లు పెరిగింది. దీంతో మళ్లీ ఔన్సు గోల్డ్ 4వేల డాలర్లు దాటింది. తాజాగా.. 4,017 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఇవాళ కూడా రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలకు చేరువులో ఉంది.
శుక్రవారం భారీగా తగ్గిన బంగారం ధర శనివార మళ్లీ పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. చైనా ఉత్పత్తులపై 100శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్‌లు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ట్రంప్ ప్రకటన తరువాత అంతర్జాతీయ మార్కెట్లలో కొంత గందరగోళం ఏర్పడింది. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఫలితంగా గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. అదే సమయంలో వెండి ధరసైతం ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ట్రంప్ నిర్ణయంతోపాటు ఇతర కారణాలు కూడా గోల్డ్ రేటు పెరగానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,13,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,260కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,24,410కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,13,900 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,24,260కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,87,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,77,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,87,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.