×
Ad

Gold Price Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో 10గ్రాముల గోల్డ్ రేటు ఇదే..

Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. గురువారం బంగారం, వెండి ధరలు..

Gold Rate Today

Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. గోల్డ్ రేటు తగ్గింది. అదేవిధంగా వెండి ధర సైతం భారీగా తగ్గింది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.170 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 24డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,060 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి రేటు భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 3వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,14,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,690కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,450కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,24,840కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,14,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,24,690కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,73,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,65,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,73,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read : Bihar CM Nitish Kumar : బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు ప్రమాణ స్వీకారం