Gold Price Today : ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే.. రాత్రికిరాత్రే భారీ మార్పులు..
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : November 28, 2025 / 11:06 AM IST
Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ భారీగా పెరిగింది. వెండి ధరసైతం వరుసగా నాల్గోరోజు పెరిగింది. దీంతో కిలో వెండి రేటు రూ.2లక్షలకు చేరువలోకి వెళ్లింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 710 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.650 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 17డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,172 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి రేటు వరుసగా నాల్గో రోజు పెరిగింది. శుక్రవారం ఉదయం కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.12వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,28,460కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,17,900కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,28,610కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,28,460 కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,83,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,76,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,83,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
