Gold Prices : బాబోయ్ బంగారం.. రూ.75వేలు దాటిన ధర, రికార్డులు తిరగరాస్తున్న కనకం

పుత్తడి ధరలు దిగి వస్తాయనే ఆశతో కొంతమంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

Gold Prices

Gold Prices : మిడిల్ ఈస్ట్ లో జియో పొలిటికల్ టెన్షన్స్, స్పెక్యులేటివ్ బయింగ్ భయంతో గోల్డ్ లో రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. రికార్డులను తిరగరాస్తూ అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు 3వేల 400 డాలర్ల వైపు కదులుతోంది. ఇవాళ ఇంట్రాడేలో ఔన్స్ గోల్డ్ 2వేల 372 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ పసిడి ధర 2వేల 361 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ జాబ్స్ డేటా అంచనాలను మించడం ఈ వారం పలు దేశాల కేంద్ర బ్యాంకులు విధాన నిర్ణయాలు తీసుకోనుండటంతో గోల్డ్ రేటు పైపైకి వెళ్తోంది.

మరోవైపు పుత్తడి ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశీయ రిటైల్ మార్కెట్ లో బంగారం డిమాండ్ తక్కువగా నమోదవుతోంది. పెళ్లిళ్ల సీజన్ చివరి దశకు చేరడంతో రిటైల్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. పుత్తడి ధరలు దిగి వస్తాయనే ఆశతో కొంతమంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇక, గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్​) గోల్డ్ ఫ్యూచర్స్ లో బంగారం ధర మరో 300 రూపాయలు పెరిగి 71వేల మార్క్ ను క్రాస్ చేసింది. స్పెక్యులేషన్స్ కొత్త పొజిషిన్స్ తీసుకోవడంతో ఇవాళ ఎంసీఎక్స్ లో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది.

ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పన్నుకు ముందు బంగారం ధరల విషయానికి వస్తే అహ్మదాబాద్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 71వేల 330 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్లు 65వేల 390 రూపాయలు పలుకుతోంది. ముంబై, కోల్ కతా, బెంగళూరులో 24 క్యారెట్లు 10 గ్రాములు 71వేల 280 రూపాయలు, 22 క్యారెట్లు 65వేల 340 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ 72వేల 150 రూపాయలు. 22 క్యారెట్లు 62వేల 140 రూపాయలు పలుకుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములు 71వేల 430 రూపాయలు, 22 క్యారెట్లు 65వేల 490 రూపాయలుగా ఉంది.

ఇక హైదరాబాద్ లో పన్నుకు ముందు 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 73వేల 530 రూపాయలుగా ఉంది. మూడు శాతం జీఎస్టీతో కలిపి హైదరాబాద్ లో పది గ్రాములు ప్యూర్ గోల్డ్ 75వేల 735 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 84వేలను అధిగమించింది. ఇక విజయవాడలో ప్యూర్ గోల్డ్ పన్నుకు ముందు పది గ్రాముల ధర 73వేల 565 రూపాయలుగా ఉంది.

Also Read : విప్రోకు నూతన సీఈవోగా శ్రీనివాస్ పల్లియా.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే?