×
Ad

బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎంతగా పెరిగాయంటే?

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు కూడా పెరిగాయి.

Gold Rate Today: దేశంలో ఇవాళ పసిడి ధరలు పెరిగాయి. ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,21,910గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,11,750గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.91,430గా ఉంది. (Gold Rate Today)

ఢిల్లీ, ముంబైలో పసిడి ధరలు

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరిగి, రూ.1,22,060గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,11,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.310 పెరిగి రూ.91,570గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,21,910గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,11,750గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.91,430గా ఉంది.

బంగారం ధరలు పెరగడానికి అనేక ఆర్థిక, అంతర్జాతీయ, స్థానిక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, స్థానిక మార్కెట్ డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయి.

Also Read: రూ.21 లక్షల పరిహారం తీసుకుంటూ.. నా కూతుళ్లు పంపిన జీతమా? అంటూ తండ్రి కన్నీరుమున్నీరు

పెరిగిన వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ ఉదయం కిలోకి రూ.1,000 చొప్పున పెరిగాయి. మూడు నగరాల్లో కిలో వెండి రూ.1,64,000గా ఉంది.

ఢిల్లీలో ఇవాళ ఉదయం కిలోకి రూ.1,000 చొప్పున పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం కిలో వెండి రూ.1,51,500గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,51,500గా ఉంది.