నా కూతుళ్లు పంపిన జీతమా పటేలా..! ఆ ముగ్గురు కుమార్తెల తండ్రి కన్నీరుమున్నీరు..

తన రెండో కూతురు జాబ్‌ చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేదని ఎల్లయ్య గౌడ్ అన్నారు.

నా కూతుళ్లు పంపిన జీతమా పటేలా..! ఆ ముగ్గురు కుమార్తెల తండ్రి కన్నీరుమున్నీరు..

Updated On : November 6, 2025 / 12:58 PM IST

తెలంగాణలోని చేవెళ్ల, మీర్జాగూడలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విషయం తెలిసిందే. వారి తండ్రి ఎల్లయ్య గౌడ్‌కు రూ.21 లక్షల పరిహారం అందింది.

ఇందుకు సంబంధించిన చెక్కును అందించేందుకు యాలాల మండలం పేర్కంపల్లిలోని ఎల్లయ్య గౌడ్‌ ఇంటికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వెళ్లారు. చెక్‌ తీసుకుంటూ ఎల్లయ్య గౌడ్‌ తన కూతుళ్లను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్న తీరు అందరినీ కలచివేసింది.

Also Read: మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ.. వీడియో చూస్తారా?

తన రెండో కూతురు జాబ్‌ చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేదని ఎల్లయ్య గౌడ్ అన్నారు. ఇప్పుడు తన ముగ్గురు కూతుళ్లు తనకు పంపిన వేతనమా ఇది అంటూ ఎల్లయ్య గౌడ్‌ కన్నీరు పెట్టటుకున్నారు.

మృతులకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ప్రకటించింది. అలాగే, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల చెక్కులు వచ్చాయి. మొత్తం కలిపి రూ.21 లక్షల విలువైన చెక్కులు ఎల్లయ్యకు అందాయి. ఎల్లయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. ఆయన కూతుళ్లు సాయి ప్రియ, నందిని, తనూష బాగా చదివేవారు.

హైదరాబాద్‌లో కాలేజీల్లో చదువుకుంటూ అక్టోబరులో వారి పెద్దక్క అనూష వివాహానికి హాజరయ్యారు. ఆమె పెళ్లి జరిగిన 17 రోజుల్లోనే ముగ్గురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎల్లయ్యకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.