Site icon 10TV Telugu

ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,03,310గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.94,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580పెరిగి రూ.77,490గా ఉంది.

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,03,460గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.94,850గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.570 పెరిగి రూ.77,610గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,03,310గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.94,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.580పెరిగి రూ.77,490గా ఉంది.

Also Read: గాజా సిటీని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం.. ఇక ఏం జరగబోతుంది?

వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరల్లో ఇవాళ మార్పులేదు. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000గా ఉంది.

ఢిల్లీ నగరంలోనూ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,17,000గా ఉంది. అంటే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,17,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Exit mobile version