Gold Rate: మూడు రోజుల్లో వెయ్యి పెరిగిన గోల్డ్ రేట్

పసిడి మరింత ప్రియంగా మారిపోతుంది.. వారాల వ్యవధిలో వేలు ధాటి తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.1000కి పైకి చేరింది. వెండి రేటు అయితే దాదాపు రూ. 3 వేలు మించిపోయింది..

Gold Rate: పసిడి మరింత ప్రియంగా మారిపోతుంది.. వారాల వ్యవధిలో వేలు ధాటి తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.1000కి పైకి చేరింది. వెండి రేటు అయితే దాదాపు రూ. 3 వేలు మించిపోయింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు వంటివి బంగారం ధర ర్యాలీకి దోహదపడుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఏప్రిల్ 15 శుక్రవారం రోజున 22 క్యారట్ల బంగారం ధర రూ.200 పైకి చేరింది. దీంతో ఈ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 49వేల 550కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. దీని రేటు రూ. 220 పెరుగుదలతో రూ.54వేల 60కు ఎగసింది. బంగారం ధర అలా రూ.54 వేలు దాటిపోయింది.

వెండి ధర రూ.200 పెరిగి దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 74వేల 400కు చేరింది. ఈ స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోతుండటంతో పెళ్లిళ్ల సీజన్ కు తంటాలు తప్పవు కావొచ్చు.

Read Also: భారీగా.. రూ.1700 పెరిగిన బంగారం ధర

మూడు రోజులుగా బంగారం ధరలు రూ.400, రూ.350, రూ.200.. ఇలా రూ. 950 పైకి చేరింది. ఇది 22 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. వెండి అయితే 4 రోజులుగా రేటు పెరుగుతూనే ఉంది. రూ. 800, రూ. 400, రూ. 1500, రూ.200 చొప్పున పెరిగింది. దీంతో వెండి రేటు రూ. 2వేల 900 పైకి కదిలింది.

విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు వరుసగా 22 క్యారెట్లకు రూ. 49వేల 550 వద్ద, 24 క్యారెట్లకు రూ. 54వేల 60 వద్ద ఉన్నాయి. వెండి రూ.74వేల 400 వద్ద ఉంది.

ట్రెండింగ్ వార్తలు