Gold Rate Today : రెండ్రోజులు భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ ఎంతో తెలుసా.. మళ్లీ భారీ మార్పులు.. కారణాలు ఇవే
Gold Rate Today : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురు, శుక్రవారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గగా..
- Harishth Thanniru
- Updated on- October 4, 2025 / 09:43 AM IST
Gold Rate Today
Gold Rate Today : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురు, శుక్రవారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. రెండ్రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ. 700 తగ్గింది. అయితే, ఇవాళ కూడా గోల్డ్ రేటులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు వెండి రేటు భారీగా పెరిగింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 42 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,886 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు.. శుక్రవారం కిలో వెండిపై రూ. 2వేలు తగ్గగా.. ఇవాళ కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,09,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,19,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,19,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,09,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,19,400కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,65,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,65,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
