Gold Rate Today
Gold Rate Today : దసరా ఉత్సవాలు ముగిశాయి. దీపావళి కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. అయితే, దసరా వేళ పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. ఒకటిరెండ్రోజులు స్వల్పంగా తగ్గినప్పటికీ రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోళ్లకు సాహసం చేయలేకపోయారు. అయితే, త్వరలోనే దీపావళి పండుగ వస్తుండడంతో అప్పుడైనా బంగారం ధరలు తగ్గుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. కానీ, మార్కెట్ వర్గాలు ద్వారా షాకింగ్ విషయాలను తెలుస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దూసుకెళ్తోంది. తాజాగా.. ఔన్సు గోల్డ్ రేటు 43 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్సు గోల్డ్ 3,886 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరో నెల రోజుల్లోనే ఔన్సు గోల్డ్ 4వేల డాలర్లను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే భారతదేశంలోనూ బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేయనున్నాయి. ఇప్పటికే 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు సుమారు 51శాతం పెరిగాయి.
మరోవైపు.. భారతదేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. దసరా సమయంలో రెండు రోజులు తగ్గిన బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. అయితే, ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అయితే, హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,09,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,19,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,19,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,09,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,19,400కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,65,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,65,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.