Gold Rate Today : ఇక్కడ పెరిగింది.. అక్కడ తగ్గింది.. బంగారం ధరల్లో భారీ మార్పులు.. కొద్దిరోజుల్లో గోల్డ్ రేటు తగ్గబోతుందా.. కారణాలు ఇవే..

Gold Rate Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..

Gold Rate Today : ఇక్కడ పెరిగింది.. అక్కడ తగ్గింది.. బంగారం ధరల్లో భారీ మార్పులు.. కొద్దిరోజుల్లో గోల్డ్ రేటు తగ్గబోతుందా.. కారణాలు ఇవే..

Gold Rate Today

Updated On : October 9, 2025 / 10:32 AM IST

Gold Rate Today : బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. రోజురోజుకు గోల్డ్ రేటు (Gold Rate Today) భారీగా పెరుగుతోంది. అమెరికా షట్ డౌన్ కొనసాగడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడం ఈ పరిస్థితికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.

ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. రూ. 220 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.200 పెరిగింది. గడిచిన వారం రోజుల్లో తులం గోల్డ్ పై సుమారు రూ. 5వేలకుపైగానే పెరిగింది. మరోవైపు వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 10 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,039 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే, మరికొద్ది రోజుల్లో గోల్డ్ రేటు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వార్ ముగియడంతోపాటు.. రష్యా, యుక్రెయిన్ మధ్య వార్‌కు ముగింపు పలికేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడితే గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,13,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,150కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,24,300కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,13,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,24,150కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,71,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,61,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,71,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.