×
Ad

Gold Rate Today : బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కోరోజే రూ.3వేలు.. తొమ్మిది రోజుల్లో రూ.36వేలు తగ్గిన వెండి ధర..

Gold Rates Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ...

Gold Rates Today

Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు (Gold Rates Today) పెరగ్గా.. వెండి ధర తగ్గింది. గత ఆరు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ఈ వారంలో 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై సుమారు రూ.7వేలు తగ్గింది. అయితే, శుక్రవారం గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది.

ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.380 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 350 పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 18డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం 4,111 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత తొమ్మిది రోజులుగా వెండి ధర తగ్గుతూ వస్తోంది. ఇవాళ (శుక్రవారం) కూడా వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 3వేలు తగ్గింది. దీంతో తొమ్మిది రోజుల్లో కిలో వెండిపై రూ. 36వేలు తగ్గింది. గత పదిరోజుల క్రితం కిలో వెండి రూ. 2లక్షలు దాటింది. అయితే, వరుసగా వెండి ధర తగ్గుతుండటంతో వెండి కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,15,000కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,460కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,610కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,15,000కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,460కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,71,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,56,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,71,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Gold Price Prediction: బంగారం ధర రూ.2.50లక్షలకు చేరుతుందా.. అసలెందుకు పెరుగుతుందో తెలుసా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..