Gold Silver Price Today
Gold Silver Price Today : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో గోల్డ్ ముడిపడిపోయింది. అయితే, ఇటీవల కాలంలో బంగారం ధరలు సామాన్యులతో దోబూచులాడుతున్నాయి. మొన్నటి వరకు బంగారం రేటు భారీగా తగ్గగా.. వినాయక చవితి పండుగ వేళ బంగారం, వెండి ధరల్లో (Gold Silver Price Today) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
వినాయక చవితి పండుగ వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాకిచ్చాడు. దీంతో గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. భారత్ పై అదనంగా మరో 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసులు జారీ చేసింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిజేసింది. దీంతో భారత దేశంలో స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. గోల్డ్ రేటు సైతం పెరిగింది.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.550 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.500 పెరిగింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై మూడు డాలర్లు పెరిగింది.. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,375 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అయితే, తెలంగాణ, ఏపీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఓ సారి పరిశీలిస్తు..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,060 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,210 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,550 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,02,060కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,30,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.