Gold Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా పసిడి(Gold Silver Rates Today), వెండి ధరలపై తీవ్రంగా పడింది.
Gold Silver Rates Today 22 July 2026 In Hyderabad Visakhapatnam Full Details
- అంతర్జాతీయ ఉద్రిక్తతలతో బంగారం ప్రియం
- తులానికి రూ.లక్షన్నరకు సమీపంలో
- ఆకాశాన్ని తాకుతున్న వెండి ధరలు
Gold Silver Rates Today: గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా పసిడి, వెండి ధరలపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో బంగారం, వెండి విపరీతమైన గిరాకీని సంతరించుకోవడంతో వీటి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో చమురు ధరలు మండిపోతుండటం మార్కెట్లలో అనిశ్చితిని పెంచేసింది. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇలాంటి ప్రతికూల సమయాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన మార్గంగా భావించి పసిడి, వెండి వైపు మొగ్గు చూపడంతో వీటి ధరలు సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(Gold Silver Rates Today) ధర రూ. 2వేలు పెరిగి ఏకంగా రూ. 1,49,400కు చేరుకుంది. అలాగే, కేజీ వెండి ధర భారీగా పెరిగి రూ. 2.32 లక్షలు పలికింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీగా లాభాల్లో ట్రేడ్ అవుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.
