Indiramma Indlu Application: ‘ఇందిరమ్మ ఇళ్ల’కు అప్లై చేస్తున్నారా? అయితే ఇది తప్పనిసరి.. లేదంటే మీ దరఖాస్తు చెల్లదు
'ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Application)' పథకం అప్లై చేసుకునే క్రమంలో ఒక కీలక నిబంధన వారికి పెద్ద సవాలుగా మారింది.
Parents Aadhaar Link is mandatory for Indiramma indlu application
- ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధన
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు తప్పనిసరి
- సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల ఇబ్బందులు
Indiramma Indlu Application: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Application)’ పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, లబ్ధిదారులు ఈ పథకానికి అప్లై చేసుకునే క్రమంలో ఒక కీలక నిబంధన వారికి పెద్ద సవాలుగా మారింది. దరఖాస్తుదారుడి వివరాలతో పాటు వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డుల వివరాలను కూడా సిస్టమ్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
Karimnagar Robbery: కరీంనగర్లో దారుణం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. కోటిన్నర సొత్తు కాజేశారు
ఈ నిబంధన కారణంగా మీసేవ కేంద్రాలకు వెళ్తున్న పలువురు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయకపోతే కంప్యూటర్ దరఖాస్తును స్వీకరించడం లేదు. గతంలోనే తల్లిదండ్రులు చనిపోయిన వారు, లేదా వారికి ఆధార్ కార్డ్ లేని వారి దరఖాస్తులు నిలిచిపోతుండటంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీనిపై స్పందించిన అర్హులు, తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు దరఖాస్తుల స్వీకరణ తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాల్లో సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జనాలు తీవ్ర రద్దీ మధ్య గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత నెమ్మదిగా సర్వర్ సమస్య పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పుంజుకుంది. నిబంధనల సడలింపుపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటేనే అర్హులందరికీ ఈ పథకం సకాలంలో అందుతుందని లబ్ధిదారులు భావిస్తున్నారు.
