ఎస్‌బీఐ గుడ్ న్యూస్: జనవరి ఒకటి నుంచి అమల్లోకి

  • Publish Date - December 31, 2019 / 02:48 AM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నూతన సంవత్సరంకు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుండగా.. మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది.

దీంతో ఇప్పటి వరకు 8.05 శాతంగా ఉన్న వడ్డీ రేటు 7.80 శాతానికి తగ్గింది. ఇక, సవరించిన వడ్డీ రేట్లు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టడం విశేషం.. ఎస్బీఐ తాజా నిర్ణయంతో కొత్తగా ఇల్లు కొనేవారికి ప్రయోజనం చేకూరనుండగా.. లేటెస్ట్ నిర్ణయంతో రెపో రేటుతో అనుసంధానించిన హోమ్ లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ఈఎంఐ భారం కూడా తగ్గిపోనుంది. 

ట్రెండింగ్ వార్తలు