Google laid off 12,000 employees but paid 226 million Dollars salary to CEO Sundar Pichai in 2022
Google Sundar Pichai : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) పేరంట్ కంపెనీ అల్ఫా బెట్ (Google Alphabet) భారీగా ఉద్యోగుల కోత విధించింది. గత రెండు నెలల క్రితం గూగుల్ కంపెనీ కాస్ట్ కటింగ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్డునపడేసింది. గత జనవరిలో దాదాపు 12వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది. కానీ, కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ( CEO Sundar Pichai) జీతం విషయంలో మాత్రం గూగుల్ ఎక్కడా రాజీపడలేదు. 2022 ఏడాదిలో ఒకవైపు ఉద్యోగుల కోత విధిస్తూనే గూగుల్.. మరోవైపు సీఈఓ పిచాయ్ జీతాన్ని అమాంతం పెంచేసింది.
అంటే.. గూగుల్ మొత్తం ఉద్యోగుల్లో 6 శాతంగా అనమాట.. అయితే, గూగుల్ సీఈఓ జీతం ఎంత పెంచింది అనేదానిపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC)కి లేటెస్ట్ రిపోర్టును రివీల్ చేసింది. అందులో పిచాయ్ 2022 ఏడాదికిగానూ సుమారు 226 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డులు ఉన్నాయి.. మన భారత కరెన్సీలో ఆయన జీతం రూ. 1800 కోట్లు ఉంటుంది. ఉద్యోగులను తొలగిస్తూ సీఈఓ జీతాన్ని పెంచడంపై తీవ్ర వివాదాస్పదమైంది. గూగుల్ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారందరి కంటే.. పిచాయ్ జీతమే ఎక్కువ..
SEC ఫైలింగ్ ప్రకారం.. పిచాయ్‌కి చెల్లించిన మొత్తంగా 218 మిలియన డాలర్లుగా ఉంది. అందులో విలువైన త్రైవార్షిక స్టాక్ అవార్డుకు కూడా ఉంది. స్టాక్ అవార్డును అందుకోనప్పుడు.. గత ఏడాదిలో పిచాయ్ జీతం 6.3 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, పిచాయ్ జీతం గత మూడేళ్లుగా 2 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022లో ఆల్ఫాబెట్‌లోని ఇతర ఎగ్జిక్యూటివ్‌ల కన్నా పిచాయ్‌కి చెల్లించిన ప్యాకేజీ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి.
Google laid off 12,000 employees but paid 226 million Dollars salary to CEO Sundar Pichai in 2022
ఉదాహరణకు.. చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ (Philipp Schindler) గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ (Prabhakar Raghavan) ఇద్దరూ దాదాపు 37 మిలియన్ డాలర్లు అందుకున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ (Ruth Porat) 24.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. వారి స్టాక్ గ్రాంట్లు ఏటా గూగుల్ అందిస్తోందని SEC ఫైలింగ్స్ వెల్లడించింది.
గూగుల్ సీఈఓ పిచాయ్ అందించే పరిహారం (compensation)పై టెక్ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆల్ఫాబెట్, ఇతర ప్రధాన కంపెనీలలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత.. జనవరిలో ఆల్ఫాబెట్ దాదాపు 12వేల మంది ఉద్యోగాలను తగ్గించడం ప్రారంభించింది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతమని చెప్పవచ్చు. కంపెనీ రాబడి, ఇతర ఖర్చులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను సరిచేసిన తర్వాత ఆయా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోత విధించడం ప్రారంభించాయి.
జీతాన్ని తగ్గించుకున్న ఆపిల్ సీఈఓ :
అదనంగా, ఆపిల్ సీఈఓ (Tim Cook) టిమ్ కుక్ గత రెండు ఏళ్లుగా ప్రతి ఏడాది 100 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. దాంతో కుక్ జీతంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఆపిల్ సీఈఓ 2023 వేతనాన్ని భారీగా తగ్గించుకున్నాడు. పిచాయ్ వేతన ప్యాకేజీ పెరిగినప్పటికీ.. గత మూడేళ్లుగా ఆయన జీతం మాత్రం స్థిరంగానే ఉంది.
218 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డు మూడు సంవత్సరాల వ్యవధిలో ఆల్ఫాబెట్ స్టాక్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, ఆండ్రాయిడ్‌తో పాటు వేమో (Waymo), వెరిలీ (Verily) వంటి ఆల్ఫాబెట్ ఇతర వ్యాపారాలతో సహా గూగుల్ విస్తారమైన ప్రొడక్టులను మార్కెట్ చేయడంలో పిచాయ్ బాధ్యత వహిస్తారు.
Google laid off 12,000 employees but paid 226 million Dollars salary to CEO Sundar Pichai in 2022
గత జనవరిలో ఉద్యోగుల తొలగింపు సందర్భంగా పిచాయ్ తమ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘గూగుల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను సుమారు 12వేల మందిని తొలగించాలని నిర్ణయించాం. అమెరికాలో తొలగించిన గూగుల్ ఉద్యోగులకు ఇప్పటికే స్పెషల్ ఈ-మెయిల్‌ను పంపడం జరిగింది. ఇతర దేశాల్లోని స్థానిక చట్టాలు, అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కష్టపడి పనిచేసిన కొంతమంది ప్రతిభావంతులను కోల్పోతున్నందుకు చాలా విచారంగా ఉంది. అందుకు ప్రగాఢంగా చింతిస్తున్నాను. ఉద్యోగాల కోతతో గూగుల్ ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలుసు. కానీ, తప్పని పరిస్థితుల్లో కంపెనీ పరమైన నిబంధనలకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నా వంతు బాధ్యతగా చేయాల్సింది చేస్తున్నాను’ అంటూ పిచాయ్ లేఖలో పేర్కొన్నారు.