Google Pay begins
Google Pay : గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై మీరు క్రెడిట్ కార్డు బిల్లులు సహా ఇతర ఎలాంటి పేమెంట్స్ చేసినా కన్వీనెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్ల కోసం గూగుల్ పేనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే, గూగుల్ పే యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కన్వీనెన్స్ ఫీజులు వర్తించే సర్వీసులు, బిల్లు పేమెంట్ల గురించి చాలా మందికి తెలియదు. నివేదిక ప్రకారం.. “గూగుల్ పే గతంలో ఫ్రీగా సర్వీసును ఉపయోగించిన వినియోగదారుల నుంచి ఫీజులను వసూలు చేసింది. అయితే, వంట గ్యాస్, విద్యుత్ బిల్లులతో సహా చిన్నమొత్తంలో కొనుగోళ్లు చేయడం వల్ల బిల్లులు చెల్లించడానికి కన్వీనెన్స్ ఫీజు వసూలు చేసింది.”
క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల పేమెంట్లపై ప్రాసెసింగ్ ఫీజులు :
నివేదిక ప్రకారం.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా పవర్, గ్యాస్ బిల్లులు వంటి యుటిలిటీలకు చెల్లించే యూజర్ల నుంచి ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm) కూడా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ఇతర సర్వీసులకు ఇదే రుసుములను వసూలు చేస్తాయి. ఈ రుసుము లావాదేవీ మొత్తంలో 0.5శాతం నుంచి 1శాతం వరకు క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్లపై విధించే సంబంధిత జీఎస్టీ (GST) కూడా ఉండవచ్చు.
యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తే ఛార్జీలు ఉండవు :
రూపే కార్డుల ద్వారా పేమెంట్ చేసినప్పటికీ కన్వీనెన్స్ ఫీజు వర్తిస్తుంది. కొన్ని బిల్ పేమెంట్ కేటగిరీలలో కార్డ్ పేమెంట్లు అనుమతించవని గూగుల్ పే యూజర్లు గుర్తుంచుకోవాలి. గూగుల్ పే వినియోగదారు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా బిల్లు పేమెంట్ చేసినప్పుడు మొత్తం బిల్లు మొత్తానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యూపీఐ ద్వారా ఉపయోగించి బిల్లు పేమెంట్లు చేస్తే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు.
ప్రాసెసింగ్ ఫీజు ఎలా లెక్కిస్తారు? :
బిల్ అమౌంట్ సహా అనేక ప్రమాణాలను బట్టి కన్వీనెన్స్ ఛార్జ్ మారుతుంది. గూగుల్ పే ప్రకారం.. “కచ్చితమైన ఫీజు బిల్లు పేమెంట్ సమయంలో కనిపిస్తుంది. మీరు ఏ బిల్లు చెల్లిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, ప్రతి లావాదేవీకి ఫీజు విధిస్తారు. గూగుల్ పే యాప్‌లో పేమెంట్ పూర్తి చేయడానికి ముందే రీసెంట్ ఫీజు వివరాలు అక్కడే కనిపిస్తాయి.
గూగుల్ పేలో ప్రాసెసింగ్ ఫీజులను ఎలా చెక్ చేయాలి :
మీరు (Google Pay) యాప్‌లో మీ పేమెంట్ హిస్టరీలో వసూలు చేసిన కచ్చితమైన కన్వీనెన్స్ ఫీజును వీక్షించవచ్చు. బిల్లు పేమెంట్ లావాదేవీ వివరాలతో పాటు ఫీజు మొత్తం లిస్టు అవుతుంది.
బిల్లు పేమెంట్ ఫెయిల్ అయితే కన్వీనెన్స్ ఫీజు రీఫండ్ :
మీ బిల్లు పేమెంట్ లావాదేవీ ఫెయిల్ అయితే.. నిర్ణీత సమయ వ్యవధిలోపు మీ పేమెంట్ అకౌంటుకు బిల్ పేమెంట్ మొత్తంతో పాటు కన్వీనెన్స్ ఫీజు కూడా తిరిగి చెల్లిస్తుంది.
ఇతర మొబైల్ నంబర్ల బిల్లు పేమెంట్‌పై కన్వీనెన్స్ ఫీజు :
మీ సొంత బిల్లు పేమెంట్ చేసినా లేదా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన బిల్లు పేమెంట్ చేసినా కూడా కన్వీనెన్స్ ఫీజు వర్తిస్తుంది. ఆయా బిల్లు పేమెంట్లతో సంబంధం లేకుండా బిల్లు పేమెంట్ లావాదేవీకి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కన్వీనెన్స్ ఫీజులో మార్పులు :
కన్వీనెన్స్ ఫీజు భవిష్యత్తులో మార్పులకు లోబడి ఉండవచ్చు. గూగుల్ పే యాప్‌లో బిల్లు పేమెంట్ చేసే సమయంలో లేటెస్ట్ ప్లాట్‌ఫామ్ రుసుము వివరాలు అక్కడే కనిపిస్తాయి.
కన్వీనెన్స్ ఫీజుల వివరాలను ఎలా తెలుసుకోవాలి? :
ప్రతి బిల్ పేమెంట్ చేసిన లావాదేవీకి వసూలు చేసే కన్వీనెన్స్ ఫీజు వివరాలను పేమెంట్ యాప్‌లోని మీ పేమెంట్ హిస్టరీ చూడవచ్చు. సంబంధిత బిల్ పేమెంట్ రుసుము మొత్తం అక్కడే కనిపిస్తుంది.