Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమేనా కొనేసుకోవచ్చు.. ఇంకా చౌకైన ధరకు ఎలా పొందాలంటే?

Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కాగానే పాత పిక్సెల్ 8a ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. గూగుల్ ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. పూర్తి వివరాలు మీకోసం..

Google Pixel 8a gets huge price cut

Google Pixel 8a Price Cut : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా పిక్సెల్ 9a ఫోన్ భారత్ సహా ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. పిక్సెల్ 9 సిరీస్‌లో ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999కు అందుబాటులో ఉంది.

Read Also : Dark Oxygen : సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ.. సముద్రపు లోతుల్లో పుట్టుకొస్తున్న ఆక్సిజన్.. ‘డార్క్ ఆక్సిజన్’ ఏంటి.. ఎవరికి లాభమంటే?

కొత్త పిక్సెల్ 9a సిరీస్ లాంచ్ అయిన వెంటనే కంపెనీ గత ఏడాదిలో లాంచ్ చేసిన పిక్సెల్ 8a ధరను కూడా భారీగా తగ్గించింది. అదనంగా, కొత్త ఫోన్‌ కొనే ముందు వినియోగదారుల కోసం వివిధ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ కాన్ఫిగరేషన్‌లో లభ్యమవుతోంది.

గూగుల్ పిక్సెల్ 8a ఫోన్‌పై డిస్కౌంట్ :
గత ఏడాదిలో గూగుల్ పిక్సెల్ 8a రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. అందులో సింగిల్ 8GB ర్యామ్‌తో 128GB, 256GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పిక్సెల్ 8a ఫోన్ మొదట రూ. 52,999 ప్రారంభ ధరకు అమ్ముడైంది. కానీ, ఇప్పుడు భారీగా 28 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఇప్పుడు ఇదే పిక్సెల్ 8a ఫోన్ ధర రూ. 37,999కి తగ్గింది. కొనుగోలుదారులు తమ కొనుగోలుపై 5 శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. రూ. 59,999తో లాంచ్ అయిన 256GB వెర్షన్ ఇప్పుడు కేవలం రూ. 44,999కే అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ 8a స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే ఆకర్షణీయమైన పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో వస్తుంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందిస్తుంది. ఇందులో ఒక ఫిజికల్ సిమ్, ఒక eSIM రెండింటికీ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.

Read Also : UPI New Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ ఫోన్ నెంబర్లతో యూపీఐ పేమెంట్లు చేయలేరు.. వెంటనే ఈ పనిచేయండి..!

పిక్సెల్ 8a 4,404mAh బ్యాటరీతో వస్తుంది. 30W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. డస్ట్, వాటర్ నష్టాన్ని కూడా తట్టుకోగలదు. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64MP మెయిన్ లెన్స్, 13MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.