Google Pixel 9
Google Pixel 9 : పిక్సెల్ అభిమానులకు పండగే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్‌ఫోన్‌లు, (Google Pixel 9) ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా వైడ్ రేంజ్ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
గూగుల్ పిక్సెల్ 9పై కూడా అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 17వేలు భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
పిక్సెల్ 9 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 మోడల్ రూ.79,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో పిక్సెల్ 9 ధర రూ.10వేలకి తగ్గింది. తద్వారా పిక్సెల్ 9 ఫోన్ కేవలం రూ. 62,999కే లభిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో అదనంగా రూ.7వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.
Read Also : Samsung Galaxy S24 FE : ఇది కదా ఆఫర్.. కొత్త శాంసంగ్ ఫోన్ కేక.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే, 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌తో కలిగి ఉంది. ఇంకా, ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉన్నాయి.
ఈ పిక్సెల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా కలిగి ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇంకా, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.