Google Pixel 9 Price : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. అతి చౌకైన ధరకే గూగుల్ పిక్సెల్ 9 ఫోన్.. ఇలా కొన్నారంటే?

Google Pixel 9 Price : అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12వేలు తగ్గింపుతో పిక్సెల్ 9 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9 Price

Google Pixel 9 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 9 కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 12వేలు భారీ (Google Pixel 9 Price) తగ్గింపును అందిస్తోంది. కొత్త అప్‌గ్రేడ్ చేసేవారికి బెస్ట్ డీల్.. పాత ఫోన్ పిక్సెల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ముగిసేలోగా ఇప్పుడే కొనేసుకోండి.

గూగుల్ పిక్సెల్ 9 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ ప్రారంభ ధర రూ.79,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.74,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పిక్సెల్ 9పై రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.7వేలు తగ్గింపును పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Vivo T4 Ultra : వివోనా మజాకా.. కొత్త వివో T4 అల్ట్రా ఫోన్ ఆగయా.. రివర్స్ ఛార్జింగ్ హైలెట్ భయ్యా.. ధర ఎంతంటే?

గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.9-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంకా, HDRకి సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. పిక్సెల్ 9లో టెన్సర్ G4 ప్రాసెసర్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ.1,09,999కు అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం రూ.89,999కు కొనేసుకోవచ్చు. రిటైలర్ పిక్సెల్ 9ప్రోపై రూ.20వేలు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. వన్ కార్డ్ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.