Google Pixel 9 Pro XL : అదిరిపోయే ఆఫర్.. రూ. 20వేలు తగ్గిన పిక్సెల్ 9 ప్రో XL ఫోన్.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?

Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ ధర తగ్గిందోచ్.. విజయ్ సేల్స్ రూ. 20వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 9 Pro XL

Google Pixel 9 Pro XL : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. విజయ్ సేల్స్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా రూ. 20వేలు తగ్గింపు ఆఫర్ చేస్తోంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్..!

విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

పిక్సెల్ 9 ప్రో XL ధర :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL  (Google Pixel 9 Pro XL) ఫోన్ భారత మార్కెట్లో రూ.1,24,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక సైట్‌లో రూ.1,14,999 ధరకు అందుబాటులో ఉంది.

ఈ పిక్సెల్ 9 ప్రో XL కొనుగోలుపై ఏకంగా రూ.10వరకు సేవింగ్ చేయొచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. దీనిపై అదనంగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు.

పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL (Google Pixel 9 Pro XL) ఫోన్ (1344×2992) పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR, 3వేల నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది.

గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ అందిస్తుంది. పిక్సెల్ 9 ప్రో XL టెన్సర్ G4 ప్రాసెసర్ కలిగి ఉంది. అలాగే, ఈ పిక్సెల్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5060mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Xiaomi YU7 electric : షావోమీ YU7 ఎలక్ట్రిక్ ఫస్ట్ SUV కారు అదుర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 835 కి.మీ దూసుకెళ్లగలదు.. ఫుల్ డిటెయిల్స్..!

ఆప్టిక్స్ విషయానికొస్తే.. పిక్సెల్ 9 ప్రో XL బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x వరకు ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కూడా ఉంది.