Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్..!

Post Office Scheme : పోస్టాఫీసు కస్టమర్లకు TD (టైమ్ డిపాజిట్) ఖాతాలపై 6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్..!

Post Office Scheme

Updated On : May 23, 2025 / 12:54 PM IST

Post Office Scheme : పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ ఖాతాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను పొందవచ్చు.

Read Also : Vi Family Plan : Vi ఫ్యామిలీ ప్లాన్.. ఇకపై సింగిల్ ప్లాన్‌లో 8 సిమ్‌లు వాడుకోవచ్చు.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్..!

ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును రెండుసార్లు తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.00 శాతానికి తగ్గించింది. సెంట్రల్ బ్యాంక్ గత ఫిబ్రవరిలో మొదట 0.25 శాతం, ఏప్రిల్‌లో 0.25 శాతం తగ్గించింది.

దాంతో ఒకవైపు బ్యాంకులు రుణాలను చౌకగా అందిస్తుండగా.. మరోవైపు, FD వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గించాయి. మరోవైపు.. పోస్టాఫీసు కూడా సేవింగ్ అకౌంట్లపై కస్టమర్లకు అధిక రాబడిని అందిస్తోంది.

పోస్టాఫీసు అందించే టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. ఇందులో రూ.3 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా రూ.44,664 స్థిర వడ్డీని పొందవచ్చు.

రూ. 3లక్షలు డిపాజిట్.. రూ. 44,664 స్థిర వడ్డీ :
పోస్టాఫీసులో కస్టమర్లకు TD (టైమ్ డిపాజిట్) అకౌంట్లపై 6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు ఒక ఏడాది TDపై 6.90 శాతం, 2 ఏళ్ల TDపై 7.0 శాతం, 3 ఏళ్ల TDపై 7.1 శాతం, 5 ఏళ్ల TDపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

పోస్టాఫీసులో 2 ఏళ్ల TD పథకంలో రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీపై మొత్తం రూ. 3,44,664 వడ్డీ లభిస్తుంది.

ఇందులో రూ. 44,664 స్థిర, హామీ వడ్డీ కూడా లభిస్తుంది. పోస్టాఫీసు TD పథకం కూడా బ్యాంకుల FD పథకం మాదిరిగానే ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో హామీతో స్థిర వడ్డీ పొందవచ్చు.

Read Also : SCSS Scheme : సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే కేవలం వడ్డీనే రూ. 12 లక్షలు సంపాదించవచ్చు!

బ్యాంకులు సాధారణ పౌరుల కన్నా సీనియర్ సిటిజన్లకు FD పథకాలపై 0.50 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తాయి. కానీ, పోస్టాఫీసు సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని ఇవ్వదు. అన్ని వయసుల కస్టమర్లు పోస్టాఫీసులో ఒకే వడ్డీని పొందవచ్చు.

Note : పోస్టాఫీసులో పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.