Vi Family Plan : Vi ఫ్యామిలీ ప్లాన్.. ఇకపై సింగిల్ ప్లాన్‌లో 8 సిమ్‌లు వాడుకోవచ్చు.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్..!

Vi Family Plan : వోడాఫోన్ ఐడియా ఫ్యామిలీ ప్లాన్లలో కొత్త యాడ్ ఇన్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ సింగిల్ ప్లాన్‌లో మరో 8 మందిని యాడ్ చేయొచ్చు.

Vi Family Plan : Vi ఫ్యామిలీ ప్లాన్.. ఇకపై సింగిల్ ప్లాన్‌లో 8 సిమ్‌లు వాడుకోవచ్చు.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్..!

Vi Family Plan

Updated On : May 23, 2025 / 11:36 AM IST

Vi Family Plan : వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు గుడ్ న్యూస్.. వినియోగదారుల కోసం సరికొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఇప్పుడు కస్టమర్‌లు కేవలం రూ. 299కే 8 మందిని ఒకే ప్లాన్‌‌లో యాడ్ చేయొచ్చు. ఇందుకోసం కొత్త యాడ్-ఆన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Read Also : BSNL Roaming Plan : పండగ చేస్కోండి.. ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారా? ఈ 18 దేశాల్లో BSNL కొత్త రోమింగ్ ప్లాన్.. ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్..!

తద్వారా కస్టమర్‌లు తమ ప్రస్తుత ఫ్యామిలీ ప్లాన్‌కు ఒక్కొక్క సభ్యునికి రూ.299 చొప్పున 8 మందిని అదనంగా యాడ్ చేయొచ్చు.

గతంలో గరిష్టంగా 5 మంది సభ్యులు మాత్రమే Vi ఫ్యామిలీ ప్లాన్‌లలో చేరే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సంఖ్య 9కి పెంచింది. అందులో ఒకరు ప్రైమరీ సభ్యులు కాగా, మిగతా 8 సెకండరీ సభ్యులుగా ఉంటారు.

వోడాఫోన్ ఐడియా ప్రకటన ప్రకారం.. ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు ఇప్పుడు తమ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన పనిలేదు. అదే ప్లానులో మరింత మంది సభ్యులను యాడ్ చేయొచ్చు.

అదనంగా యాడ్ చేసే సభ్యునికి నెలకు రూ. 299 చెల్లించాలి. ప్రతి సభ్యునికి 40GB హై-స్పీడ్ డేటా వస్తుంది. వాయిస్ కాలింగ్, SMS, OTT బెనిఫిట్స్ పొందొచ్చు.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు :
వోడాఫోన్ ఐడియా ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 701 ప్లాన్‌లో ప్రైమరీ, సెకండరీ సభ్యులు ఉంటారు. ఇప్పుడు కస్టమర్‌లు ఈ ప్లాన్‌కు మరో 7 మందిని యాడ్ చేయొచ్చు. తద్వారా మొత్తం 9 మందిని ఒకే అకౌంటుకు కనెక్ట్ చేయవచ్చు.

వోడాఫోన్ ఐడియా రూ.1201, రూ.1401 ధరలతో రెండు ఫ్యామిలీ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు Swiggy One మెంబర్‌షిప్, EazyDiner మెంబర్‌షిప్, డేటాతో పాటు OTT యాప్‌లకు యాక్సెస్ వంటి ప్రీమియం బెనిఫిట్స్ పొందొచ్చు.

Read Also : PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు 2.0 తీసుకున్నారా? ఎలా అప్లయ్ చేయాలి? ఇదిగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

కొత్త వారిని ఎలా యాడ్ చేయాలంటే? :
సరసమైన ధరలో రూ. 299 ఫ్యామిలీ కనెక్షన్‌ను అందిస్తున్నట్లు వోడాఫోన్ ఐడియా పేర్కొంది. Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ అకౌంటులో కొత్త సభ్యులను యాడ్ చేసేందుకు Vi యాప్‌ను నేరుగా యాక్సస్ చేయొచ్చు. అంతేకాదు.. అదనపు డేటాతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.