BSNL Roaming Plan : పండగ చేస్కోండి.. ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారా? ఈ 18 దేశాల్లో BSNL కొత్త రోమింగ్ ప్లాన్.. ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్..!
BSNL Roaming Plan : BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్.. విదేశాల్లో ప్రయాణించేవారి కోసం సరికొత్త రోమింగ్ ప్లాన్ తీసుకొచ్చింది.

BSNL Roaming Plan
BSNL Roaming Plan : విదేశాలకు వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. మీరు BSNL కస్టమర్లు అయితే ఇది మీకోసమే.. విదేశాల్లో ప్రయాణించే బీఎస్ఎన్ఎల్ (BSNL Roaming Plan) యూజర్ల కోసం గోల్డ్ ఇంటర్నేషనల్ ప్లాన్ అనే సరసమైన కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ రోమింగ్ ప్లాన్‌తో ప్రయాణికులు కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. 18 దేశాలలో తమ BSNL సిమ్ కార్డునే ఉపయోగించవచ్చు. వినియోగదారులు ప్రయాణంలో కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ ఫారెన్ ట్రావెలర్స్ కోసం రూపొందించినట్టు BSNL అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
రూ. 5399 ప్లాన్, 30 రోజుల వ్యాలిడిటీ :
రూ. 5399 ధరతో ఈ గోల్డ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు కేవలం రూ. 180 మాత్రమే చెల్లించాలి. ప్రయాణికులు అక్కడి లోకల్ సిమ్ అవసరం లేకుండా 18 దేశాలలో స్వేచ్ఛగా తిరగవచ్చు. 30 నిమిషాల వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 15 SMS, 3GB డేటాను కూడా పొందొచ్చు.
విదేశాల్లో ప్రయాణించేవారికి కమ్యూనికేషన్, డేటా సర్వీసులను పొందవచ్చు. ఈ రోమింగ్ ప్లాన్ 18 దేశాలలో అందుబాటులో ఉందని బీఎస్ఎన్ఎల్ ధృవీకరించింది. వినియోగదారులు ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ పొందవచ్చు.
Travel Without Borders, Stay Connected Globally.
Pack your bags and your BSNL connectionBSNL’s International Roaming Pack lets you explore 18 countries with ease, just ₹180/day.
For more visit : https://t.co/nRAfQ8WfpX#BSNLIndia #ConnectingWithCare #TravelWithoutBorders… pic.twitter.com/dV1qxTFoJj
— BSNL India (@BSNLCorporate) May 21, 2025
లోకల్ సిమ్ అవసరం ఉండదు. ఈ సర్వీసు కోసం బీఎస్ఎన్ఎల్ ఈ కింది ప్రాంతాలలోని లోకల్ టెలికాం ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రోమింగ్ ప్లాన్ అందుబాటులో ఉన్న దేశాలివే.. :
భూటాన్ : B మొబైల్
గ్రీస్ : WIND
మలేషియా : U మొబైల్
ఆస్ట్రియా : హచ్
చైనా : చైనా టెలికాం
వియత్నాం : వియెట్టెల్ (Viettel)
నేపాల్ : NTC
శ్రీలంక : డైలాగ్ (Dialog)
జర్మనీ : టెలిఫోనికా
ఇజ్రాయెల్ : హాట్ మొబైల్
బంగ్లాదేశ్ : గ్రామీణఫోన్ (Grameenphone)
మయన్మార్ : MPT
కువైట్ : జైన్
థాయిలాండ్ : ట్రైనెట్
డెన్మార్క్ : హాయ్ 3AS
ఉజ్బెకిస్తాన్ : Ucell
ఫ్రాన్స్ : Bouygues
జపాన్ : NTT డొకోమో