Vodafone Idea : Vi యూజర్లకు పండగే.. 3 కొత్త గేమ్ ఛేజింగ్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా కాలింగ్, అన్‌‌లిమిటెడ్ డేటాతో 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vodafone Idea : Vi యూజర్లకు పండగే.. 3 కొత్త గేమ్ ఛేజింగ్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Vodafone Idea

Updated On : May 22, 2025 / 10:26 PM IST

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్.. ‘నాన్‌స్టాప్ హీరో’ ప్యాక్ కింద (Vodafone Idea) సరికొత్త 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఆసక్తిగల వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఇలా చేస్తే.. అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

ఈ ప్లాన్‌లతో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్ల ధరలు రూ.398, రూ.698, రూ.1048 చొప్పున 84 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తాయి.

రూ. 398 ప్లాన్:
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, భారత్‌లో ఎక్కడికైనా కాల్ చేసేందుకు రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ ఉన్నాయి. అన్‌లిమిటెడ్ డేటాను కూడా పొందవచ్చు. డే టైమ్ లేదా నైట్ ఎలాంటి లిమిట్స్ లేకుండా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయొచ్చు.

రూ.698 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, భారత్ అంతటా రోజువారీ 100 ఫ్రీ SMS కూడా ఉన్నాయి. వినియోగదారులు డే లేదా నైట్ అయినా ఫ్రీ ఇంటర్నెట్‌ అన్‌లిమిటెడ్ డేటాను కూడా పొందొచ్చు.

రూ.1048 ప్లాన్ :
ఈ ప్లాన్ (Vodafone Idea) 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, భారత్‌లో ఎక్కడైనా రోజుకు 100 SMS అందిస్తుంది. గత ప్లాన్‌ల మాదిరిగానే వినియోగదారులు డే లేదా నైట్ ఏ సమయంలోనైనా ఎలాంటి లిమిట్ లేకుండా అన్‌లిమిటెడ్ డేటాను పొందొచ్చు.

వోడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ డేటా 300GB డేటా అని గమనించాలి. ఈ 3 ప్లాన్‌లు మహారాష్ట్ర, గోవాతో పాటు కర్ణాటకలో అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, అస్సాం, ఈశాన్య, ఒరిస్సా టెలికాం సర్కిల్‌తో సహా ఇతర ప్రాంతాలలో కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also : Motorola Razr 60 : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఇటీవలే వోడాఫోన్ ఐడియా రూ.4,999 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా అనేక వార్షిక రీఛార్జ్ ఆప్షన్లను కలిగినప్పటికీ, రూ.4వేల కన్నా తక్కువ ధరకే అందిస్తోంది.