Motorola Razr 60 : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola Razr 60 : మోటోరోలా రెజర్ 60 మడతబెట్టే ఫోన్ ఈ నెల 28న భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Motorola Razr 60 : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola Razr 60

Updated On : May 22, 2025 / 9:59 PM IST

Motorola Razr 60 : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లోకి ఫ్లాగ్‌షిప్ రెజర్ 60 అల్ట్రా (Motorola Razr 60) ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే, మోటోరోలా వచ్చే వారం రెజర్ 60 అనే మరో ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.

Read Also : iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో మాక్స్.. ఇలా చేస్తే.. అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

ఈ మడతబెట్టే ఫోన్ భారత మార్కెట్లో మొట్టమొదటి పెర్ల్ అసిటేట్ లేదా ఫాబ్రిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

ఈ మోటోరోలా ఫోన్ పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ స్ప్రింగ్ బడ్, పాంటోన్ లైటెస్ట్ స్కై కలర్స్ సహా 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటో రేజర్ 60 ఫోన్ లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

భారత్‌లో మోటోరోలా రెజర్ 60 లాంచ్ తేదీ :
మే 28న భారత మార్కెట్లో మోటోరోలా రేజర్ 60 లాంచ్ అవుతుంది. సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అవుతుంది. మోటో రేజర్ 50 కన్నా భారీ అప్‌గ్రేడ్‌లతో రానుంది.

మోటోరోలా రేజర్ 60 స్పెసిఫికేషన్లు (అంచనా) :
మోటరోలా రేజర్ 60 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3వేల నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.96-అంగుళాల FHD+ pOLED LTPO ప్యానెల్‌ను కలిగి ఉంటుందని అంచనా. 1,700 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 3.63-అంగుళాల pOLED 90Hz కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు.

ఈ మోటోరోలా ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌తో రానుంది.

ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 4,500mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉండవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ IP48 సర్టిఫికేషన్‌ను పొందవచ్చు. OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో రావచ్చు. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్‌ను పొందవచ్చు.

Read Also : Realme 14 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. రియల్‌మి 14 ప్రో ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

మోటోరోలా రేజర్ 60 ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో మోటోరోలా రేజర్ 60 ధర దాదాపు రూ.60వేల వరకు ఉండవచ్చు. అయితే, కంపెనీ ధర ఎంతో రివీల్ చేయలేదు.