Google Pixel 9a Sale Date
Google Pixel 9a Sale Date : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో పిక్సెల్ 9a ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ పిక్సెల్ 9a ఫోన్ సేల్ తేదీని గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 16 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.49,999 ధరకు లభిస్తుంది. లాంచ్ ఆఫర్ విషయానికి వస్తే.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ సింగిల్ వేరియంట్‌లో విడుదల అయింది. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ పలు దేశాలలో అమ్మకానికి వస్తుంది. కానీ, భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9a టాప్ ఫీచర్లు :
గూగుల్ కొత్త పిక్సెల్ 9a ప్రీమియం ఫీచర్లతో సరసమైన ధరకు రిలీజ్ చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో వస్తుంది. సెక్యూరిటీ కోసం టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. పిక్సెల్ 9a 7 ఏళ్ల OS అప్‌డేట్‌లతో వస్తుంది. ఫొటోగ్రఫీ కోసం అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వస్తుంది.
డ్యూయల్ రియర్ కెమెరాకు సపోర్టు ఇస్తుంది. 48MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ షూటర్ కూాడా ఉంది. ఏఐ అప్‌గ్రేడ్ ఫోటోగ్రఫీని కలిగి ఉంది. ఇంప్రూడ్ నైట్ మోడ్, రియల్ టోన్ ఫీచర్లతో వస్తుంది.
ఈ ఫోన్ 5100mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. రోజంతా ఎంతైనా వాడొచ్చు. 23W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
మీరు గూగుల్ పిక్సెల్ 9a కొనాలా? :
గూగుల్ పిక్సెల్ 9a గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్, ప్రీమియం OLED డిస్‌ప్లే, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫీచర్లను సరసమైన ధరకే అందిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు, పవర్‌ఫుల్ కెమెరా సెటప్, 120Hz డిస్‌ప్లే, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.