PAN Card 2.0 Fraud : యూపీఐ యూజర్లు జర జాగ్రత్త.. మీకు ఇలా మెసేజ్, కాల్ వచ్చిందా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టే.. ఇలా చేయండి!
PAN Card 2.0 Fraud : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సైబర్ మోసగాళ్ళు పాన్ కార్డు 2.0 పేరుతో కొత్త సైబర్ స్కామ్ చేస్తున్నారు. మీరు సైబర్ స్కామ్‌ల బారిన పడకుండా ఇలా చేయండి..

PAN Card 2.0 Fraud
PAN Card 2.0 Fraud : యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్ల కోసం UPI వాడకం భారీగా పెరిగింది. సైబర్ నేరస్థులు ఇదే క్యాష్ చేసుకునేందుకు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులను నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సైబర్ మోసాలపై యూపీఐ యూజర్లను అప్రమత్తం చేస్తోంది. బ్యాంక్ అకౌంట్లలో డబ్బును కాజేసే కొత్త స్కామ్ గురించి హెచ్చరికను జారీ చేసింది. ఈ కొత్త స్కామ్ బారిన పడకుండా యూపీఐ వినియోగదారులు ఎలా రక్షించుకోవచ్చో తెలియజేస్తోంది.
పాన్ కార్డ్ 2.0 స్కామ్ ఏంటి? :
NPCI అధికారిక (X) ద్వారా “పాన్ కార్డ్ 2.0 అప్‌గ్రేడ్” పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తోంది. బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను షేర్ చేయమనే కొత్త స్కామ్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. మోసగాళ్ళు ఇలా పేర్కొంటూ ఫేక్ మెసేజ్‌లను పంపుతారు.
మీ పాన్ కార్డ్ బ్లాక్ అయింది. పాన్ కార్డ్ 2.0కి అప్‌గ్రేడ్ చేసుకోండి. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను చెప్పండి. చాలా మంది ఈ మోసాల బారిన పడుతున్నారు. తెలియకుండానే వారి వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తారు. ప్రతి అప్‌గ్రేడ్ నిజమైనది కాదని గుర్తించాలి. ఈ స్కామ్ మీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఖాళీ చేస్తుందని NPCI హెచ్చరించింది.
UPI మోసాల నుంచి సేఫ్‌గా ఎలా ఉండాలి?
- ఇలాంటి డిజిటల్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్ తెలుసుకోండి.
- SMS, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే తెలియని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
- మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ లేదా ఆధార్ నంబర్‌ను ఎవరితోనూ షేర్ చేయొద్దు.
- మీ పాన్ కార్డును అప్‌గ్రేడ్ చేయమంటూ అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మొద్దు.. వెంటనే మెసేజ్ డిలీట్ చేయండి.
- వ్యక్తిగత ఆర్థిక వివరాలను అడిగే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ వంటి టెక్ట్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.
- NPCI, బ్యాంకులు లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు వెళ్లి నేరుగా అధికారిక సమాచారాన్ని వెరిఫై చేసుకోండి.
NPCI అవగాహన ప్రచారం :
ఇలాంటి మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు NPCI (#MainMoorkhNahiHoon) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించాలని, మోసగాళ్ల మాయలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ హెచ్చరికను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయాలని NPCI కోరుతోంది. తద్వారా వారు కూడా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
తప్పక గుర్తుంచుకోండి : ఏ బ్యాంకు, ప్రభుత్వ సంస్థ లేదా ఆర్థిక సంస్థ కూడా మీ వ్యక్తిగత వివరాలను మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడూ అడగవు.