TGPSC Group 1 Results : ఉగాది రోజున గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
TGPSC Group 1 Results : ఉగాది పర్వదినాన గ్రూపు-1 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల అయింది. ఇందులో మహిళ అభ్యర్థులే పైచేయి సాధించారు. మొదటి ర్యాంకు మహిళకే వచ్చింది. ర్యాంకుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

TGPSC Group 1 Results
TGPSC Group 1 Results : ఉగాది పర్వదినాన గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు (GRL) విడుదల చేసింది.
ఆదివారం (మార్చి 30) జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూపు 1 అభ్యర్థుల సాధించిన మార్కులతో పాటు జోన్ల వారీగా వివరాలను వెల్లడించారు. అయితే, TGPSC అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ జీఆర్ఎల్ లిస్టును అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ర్యాంక్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 1 ఫలితాల్లో మహిళలు ఎస్సీ, బీసీలే పైచేయి సాధించారు.
మహిళలదే పైచేయి..
గ్రూప్ మొదటి ర్యాంక్ మహిళ అభ్యర్థికే దక్కింది. మొత్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి TGPSC పరీక్షలను కూడా నిర్వహించింది. 550 మార్కులతో మహిళా అభ్యర్థి టాప్ స్కోర్‌గా నిలవగా, 535 మార్కులతో రెండు, మూడో ర్యాంకులో ఇద్దరు పురుష అభ్యర్థులు ఉన్నారు. 532 మార్కులతో మరో మహిళా అభ్యర్థి 4 ర్యాంకులో నిలిచారు.
ఇటీవలే గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలకు సంబంధించి ప్రొవిజనల్ మార్కుల జాబితాను ప్రకటించారు. ఇందులో అభ్యంతరాలను స్వీకరించిన టీజీపీఎస్సీ.. రీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. మల్టీ జోన్లపరంగా ఎవరు ఏ ర్యాంకులో నిలిచారో పూర్తి వివరాలను జాబితాలో పేర్కొంది.
Read Also : BYD Unit : మన హైదరాబాద్‌లో BYD కోసం 200 ఎకరాలు.. కొత్త ప్లాంట్ ఇక్కడే..?
ర్యాంకింగ్ లిస్ట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి :
- TGPSC గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in/)లోకి వెళ్లాలి.
- గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
- అభ్యర్థులకు సంబంధించి ఫుల్ డిటెయిల్స్‌తో PDF ఓపెన్ అవుతుంది.
- అభ్యర్థి హాల్ టికెట్, సాధించిన మార్కులు, ర్యాంకింగ్ లిస్ట్ ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ ట్యాప్ చేసి హార్డ్ కాపీని పొందవచ్చు.
గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత పేపర్ల ఎవాల్యూషన్ జరిగింది. మార్చి 10వ తేదీన ప్రొవిజనల్ మార్కుల జాబితాను ప్రకటించింది. రీకౌంటింగ్ అవకాశం కల్పించిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది.