Banks Hidden Fees : బాబోయ్.. బాదుడే బాదుడు.. బ్యాంకుల హిడెన్ చార్జీల గురించి తెలుసా..? చార్జీలు పడకుండా ఇలా తప్పించుకోండి..!

Banks Hidden Fees : మీ బ్యాంక్ అందించే సేవలు ఉచితమని అనుకుంటున్నారా? మరోసారి ఆలోచించండి.. బ్యాంకులు మీకు తెలియకుండానే కొన్ని హిడెన్ చార్జీలను విధిస్తున్నాయి. ఖాతాదారులు ఈ చార్జీల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి.

Banks Hidden Fees : బాబోయ్.. బాదుడే బాదుడు.. బ్యాంకుల హిడెన్ చార్జీల గురించి తెలుసా..? చార్జీలు పడకుండా ఇలా తప్పించుకోండి..!

Banks Hidden Fees

Updated On : March 30, 2025 / 12:17 PM IST

Banks Hidden Fees : బ్యాంకులు కస్టమర్లకు అందించే సేవలు అన్ని ఉచితం కాదు.. అందులో కనిపించని చార్జీలు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకు ఖాతాదారులకు ఈ చార్జీలపై పెద్దగా అవగాహన ఉండదు. దాంతో చాలా మంది అనవసరంగా చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మినిమం బ్యాలెన్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, సీడీఎం డిపాజిట్స్, ఏటీఎం విత్ డ్రాయల్స్ విషయంలో భారీగానే చార్జీలు బాదుతున్నాయి.

అయితే, ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా చార్జీలు ఉంటాయి. అందులోనూ అకౌంట్ టైప్ బట్టి మారవచ్చు. కరెంటు అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ ఏదైనా సరే చార్జీలు ఉంటాయి. చాలా మంది ఖాతాదారులు తమ బ్యాంక్ స్టేట్‌‌మెంట్లను పూర్తిగా చూసుకోరు. దాంతో తెలియకుండానే చార్జీలను చెల్లించాల్సి రావచ్చు. వీటిని ముందుగానే తెలుసుకుంటే చార్జీలు పడకుండా ముందుగానే తప్పించుకోవచ్చు.

Read Also : WhatsApp Music : వావ్.. ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ వాట్సాప్‌ స్టేటస్‌కు మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

మినిమం బ్యాలెన్స్ :
చాలా సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి. లిమిట్ కన్నా తక్కువగా ఉంటే రూ.300 నుంచి 1,000 వరకు పెనాల్టీ వేస్తాయి. అయితే, ఈ చార్జీలు అకౌంట్లు, బ్యాంకులను బట్టి మారుతుంటాయి.

చెక్ బౌన్స్ చార్జీలు :
చెక్కులు బౌన్స్ అయినా కూడా బ్యాంకులు పెనాల్టీ వేస్తాయి. రూ. 250 నుంచి రూ.500వరకు చార్జీలు విధిస్తాయి. ఫ్రీ లిమిట్ తర్వాత చెక్ బుక్ జారీకి కూడా చార్జీలు పడతాయి. 25 చెక్కులతో బుక్ తీసుకుంటే రూ.100 వరకు బ్యాంకులు చార్జీలు వేస్తాయి.

అకౌంట్ మెనేజ్‌మెంట్ చార్జీలు :
కస్టమర్లలో కొన్ని రకాల అకౌంట్లపై కూడా చార్జీలు ఉంటాయి. కరెంట్ అకౌంట్ల కస్టమర్లు NEFT, RTGS విధానాల్లో ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు నిబంధనలు తప్పితే చార్జీలు పడతాయి. నెలవారీ అకౌంట్ నిర్వహణ చార్జీలను కూడా చెల్లించాలి. ఏడాది చార్జీలు కూడా రూ. 500 నుంచి రూ. 1,500 వరకు చెల్లించాల్సి రావచ్చు.

ఏటీఎం విత్‌‌డ్రా ఛార్జీలు :
బ్యాంకులు తమ సొంత ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే చార్జీలు వేయవు. వేరే బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు తీస్తే మాత్రం రూ. 20 నుంచి రూ. 50 మధ్య చార్జీలు వేస్తాయి. CDM మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేసినా కూడా చార్జీలు వేస్తాయి. నెలలో ఫ్రీ లిమిట్ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.23 చొప్పున చార్జ్ చేయాల్సిందిగా ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది.

ఓవర్ డ్రాఫ్ట్ :
ఓవర్ డ్రాఫ్ట్ (నెగటివ్ బ్యాలెన్స్) ఉన్న అకౌంట్లపై కూడా బ్యాంకులు భారీగా చార్జీలు వేస్తాయి. ఒక్కోసారి రూ. 400 నుంచి రూ. 800 వరకు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

అదనపు సర్వీసు చార్జీలు :
SMS బ్యాంకింగ్, మిసడ్ కాల్ సర్వీస్ వంటి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ సర్వీసులపై కూడా సుమారు రూ.50 నుంచి రూ.100 వరకు చార్జీలు వేస్తాయి. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసిన కస్టమర్లు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫీజులు :
NEFT, RTGS ద్వారా లావాదేవీలు జరిపినా కూడా ఛార్జీలు పడతాయి. SBIలో NEFT ద్వారా రూ.10 వేలు పంపితే రూ.2.25 చార్జీలు పడతాయి. రూ.10 వేల నుంచి రూ. లక్షలోపు పంపితే రూ. 4 చార్జీ పడుతుంది. ఈ రెండు సర్వీసులను ఫ్రీగా అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.

లోన్ ప్రాసెసింగ్ చార్జీలు :
కస్టమర్లు ఏదైనా లోన్ తీసుకుంటే దానిపై కూడా 0.5 నుంచి 2 శాతం వరకు బ్యాంకులు లోన్ ప్రాసెసింగ్ పేరుతో చార్జ్ చేస్తాయి. రివార్డు పాయింట్ల ద్వారా ఏదైనా కొనుగోలు చేసినా కూడా ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

చార్జీలు పడకుండా ఉండాలంటే? :
బ్యాంకులు విధించే చార్జీలు పడకుండా ఉండాలంటే.. బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. డబ్బులను విత్‌డ్రా కోసం మీ బ్యాంకు సంబంధిత ఏటీఎంలను మాత్రమే వినియోగించాలి. రెగ్యులర్ డైరెక్ట్ డిపాజిట్ల అకౌంట్లను ఖర్చులకు వినియోగించాలి. కొన్ని బ్యాంకులు వీటికి ఎలాంటి చార్జీలు వేయవు. బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలిస్తే హిడెన్ చార్జీలు కనిపిస్తాయి.

Read Also : TGPSC Group 1 Results : ఉగాది రోజున గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల.. డౌన్‌‌లోడ్ చేసుకోండిలా..!

బిల్స్ పేమెంట్, లోన్ పేమెంట్స్, మనీ ట్రాన్సాఫర్, యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్లను ఎక్కువగా చేయండి. ఓవర్ డ్రాఫ్ట్ చార్జీలు పడకుండా ఉండేందుకు చెకింగ్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ లేదా క్రెడిట్ లైన్‌కు లింక్ చేయండి. ట్రాన్సాక్షన్ చార్జీలను తగ్గించుకోవడానికి చిన్న మొత్తంలో కాకుండా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తుండాలి.